STOCKS

News


నెలరోజుల గరిష్టానికి పసిడి

Tuesday 4th December 2018
Markets_main1543901540.png-22605

ప్రపంచమార్కెట్లో పసిడి ధరల మంగళవారం నెలరోజుల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. జీ-20 సదస్సులో జరిగి చర్చల ఫలితంగా అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కలికంగా తెరపడింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్‌ నుంచి ఈక్విటీ షేర్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ మారకం బలహీనపడుతోంది. మరోవైపు ఫెడ్‌ కీలక వడ్డీరేట్ల సందిగ్ధత భయాలు ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతుండం కూడా డాలర్‌ అస్థిరతకు దోహదపడుతోంది. డాలర్‌ నీరసించడం పసిడికి బలాన్నిస్తుంది. ఫలితంగా గత ట్రేడింగ్‌లో పసిడి 17డాలర్లు లాభపడి 1,240.40 డాలర్ల వద్దకు చేరింది. ఈ స్థాయి పసిడి 5వారాల గరిష్టస్థాయి స్థాయి కావడం విశేషం. చివరకు రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 1,239.6 డాల్ల వద్ద స్థిరపడింది. నేడు ఆసియా పలు మార్కెట్ల మిశమ్ర ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ స్తబ్దుగా ర్యాలీ చేయడం తదితర కారణాలతో పసిడి గత ముగింపుతో పోలిస్తే మరో 3డాలర్లు లాభపడి 1,242.60డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.10:30ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 2.40డాలర్లు లాభపడి 1,242.00డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా లాభాల్లోనే:-
ఇక దేశీయంగా పసిడికి ధరకి రూపాయి పతనం కలిసొస్తుంది. నేడు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల డిసెంబర్‌ కాంట్రాక్టు ధర రూ.52.00లు లాభపడి రూ. 30800.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Tuesday 4th December 2018

బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో మంగళవారం బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం నష్టపోయింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ 26,809.50ల వద్ద ప్రారంభమైంది. నేడు మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో భాగంగా బ్యాంకింగ్‌ నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా ఈ రంగ షేర్లలో అధిక వెయిటేజీ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

బ్రోకరేజ్‌లు ‘బై రేటింగ్‌’ ఇచ్చిన 6 షేర్లు..

Tuesday 4th December 2018

ముంబై: స్వల్పకాలానికి 7 నుంచి 33 శాతం రాబడిని అందించగలిగిన 6 షేర్లను పలు బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేస్తున్నాయి. అవేంటంటే.. ఎస్కార్ట్స్‌ బ్రోకరేజ్‌ సంస్థ: ఎస్‌ఎంసీ రీసెర్చ్‌ రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.695-700 | టార్గెట్ ధర: రూ.750-760 | రాబడి అంచనా: 7 శాతం ఫెడరల్ బ్యాంక్ బ్రోకరేజ్‌ సంస్థ: ఎస్‌ఎంసీ రీసెర్చ్ రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.83.50-84.50 | టార్గెట్ ధర:

Most from this category