STOCKS

News


పసిడి రయ్‌.. రయ్‌..

Saturday 27th October 2018
Markets_main1540635952.png-21539

పసిడి ధర శుక్రవారం రాత్రి 3 నెలల గరిష్టం వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 6.30 డాలర్లు లాభపడి 1,235.40 వద్ద ముగిసింది. అమెరికాలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయకపోవడంతో అక్కడి మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ గరిష్ట స్థాయిల నుంచి తగ్గుదల కూడా పసిడి పెరుగుదలకు మరో కారణమైంది. డాలర్‌ ఇండెక్స్‌ 0.30 శాతం క్షీణించి 96.16 స్థాయి వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలకు తోడు పలు దేశాల్లో నెలకొన్న ఆర్థిక అస్థిరతలతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా పసిడి ధర 1200 డాలర్లకు ఎగిసింది. అక్కడ నుంచి సాంకేతిక కారణాలు పసిడి పెరుగుదలకు సహకరించాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక వారం వారీగా చూస్తే పసిడి ఏకంగా 10.50 డాలర్లు లాభపడింది. పసిడి లాభాల్లో ముగియడం ఇది నాలుగో వారం.
దేశీయంగానూ స్వల్ప పెరుగుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ చేయడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గుముఖం పట్టడం తదితర కారణాలతో దేశీయంగానూ పసిడి ధర పెరిగింది.  ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల పసిడి రూ.71లు లాభపడి రూ.31932.00ల వద్ద ముగిసింది.



You may be interested

వ్యాల్యూ స్టాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారా...?

Sunday 28th October 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కీలకమైన మద్దతు స్థాయిలకు సమీపంలో ఉన్నాయి. గరిష్ట స్థాయిల నుంచి చూస్తే సుమారు 14 శాతం నష్టపోయాయి. అయితే, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లో ఎక్కువ శాతం, బ్లూచిప్‌ కంపెనీల్లో కొన్ని ఇండెక్స్‌ల కంటే ఎక్కువే నష్టాలను చూవిచూశాయి. దీంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారి ముందు... తక్కువ ధరల వద్ద లభిస్తున్న ఎన్నో స్టాక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలన్న సంశయం ఎదురైనా

వ్యాల్యు పిక్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  స్టాక్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.966 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,182 ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌పై ఆనందరాఠి బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్‌ ధర వచ్చే ఏడాది కాలంలో రూ.1,182లకు చేరొచ్చని అంచనా వేస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీని నెక్ట్స్‌-జనరేషన్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీగా అభివర్ణించింది. కంపెనీకి

Most from this category