STOCKS

News


2-వారాల గరిష్టానికి పసిడి

Saturday 16th February 2019
Markets_main1550310817.png-24223

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 2వారాల గరిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో మార్కెట్‌లో 8.20డాలర్ల లాభపడి 1,322.10 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ ఏడాది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనే అంచనాలతో డాలర్‌ ఇండెక్స్‌ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోంటుంది. అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల బిల్లుకు కాంగ్రెస్‌ అనుమతులు నిరాకరిచడంతో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యవవసర(నేషనల్‌ ఎమర్జెన్సీ) పరిస్థితికి తెరతీశారు. అలాగే అమెరికా జనవరి రీటైల్‌ గణాంకాల బలహీనత తదితర కారణాలు పసిడి కొనుగోళ్లు మద్దతినిచ్చాయి. ఫలితంగా రాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 12డాలర్ల వరకు లాభపడి 1,325.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. వారం మొత్తం మీద చూస్తే పసడి ధర 0.27శాతం లాభపడింది. 
దేశీయంగానూ రూ.305లు అప్‌:-
అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ర్యాలీ చేయడంతో దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో కూడా పసిడి లాభాల బాట పట్టింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో రాత్రి ఔన్స్‌ పసిడి ధర రూ.305లు లాభపడి రూ.33384.00ల వద్ద ముగిసింది.



You may be interested

జనవరిలో ఎగుమతులు అంతంతమాత్రం

Saturday 16th February 2019

వృద్ధి కేవలం 3.74 శాతం విలువలో 26.36 బిలియన్‌ డాలర్లు దిగుమతుల విలువ 41 బిలియన్‌ డాలర్లు వాణిజ్యలోటు 15 బిలియన్‌ డాలర్లు 38 శాతం పెరిగిన పసిడి దిగుమతులు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు జనవరిలో నిరాశను మిగిల్చాయి. 2018 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి రేటు కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. విలువ 25.51 బిలియన్‌ డాలర్ల నుంచి 26.36 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక ఇదే సమయంలో దిగుమతులు 41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ వార్నింగ్‌

Saturday 16th February 2019

రహస్యంగా ఉంచాల్సిన నివేదికలో కొంత భాగాన్ని బహిర్గతం చేయడం పట్ల యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌ఏఆర్‌(రిస్క్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌)లో అంశాలను అందరికీ తెలియజేయడమనేది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా అభివర్ణించింది. ఇందుకుగాను యస్‌బ్యాంక్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆర్‌బీఐ వార్నింగ్‌ లెటర్‌ పంపినట్లు యస్‌బ్యాంక్‌ తాజాగా స్టాక్‌ఎక్చేంజ్‌లకు వెల్లడించింది. బ్యాంకు పనితీరులో ఇంకా అనేక లొసుగులు, నియంత్రణా ఉల్లంఘనలు ఉన్నాయని ఆర్‌ఏఆర్‌ గుర్తించినట్లు తెలిపింది.

Most from this category