STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Saturday 23rd February 2019
Markets_main1550915977.png-24298

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం లాభపడింది. గతరాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు పెరిగి 1,332.80 డాలర్ల వద్ద ముగిసింది.  వరుసగా రెండోవారం లాభాల ముగింపు కావడం విశేషం. డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుదల, ట్రేడ్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత పసిడికి తోడ్పాటును అందిస్తున్నాయి.  వడ్డీరేట్లపై ఫెడ్‌రిజర్వ్‌ సానుకూల ధోరణి.. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌  ర్యాలీకి అవరోధాన్ని కలిస్తుంది. ఈ వారంలో డాలరు ఇండెక్స్‌ నెలరోజుల కనిష్టానికి పతమైన సంగతి తెలిసిందే. అమెరికా - చైనాల మధ్య జరగుతున్న వాణిజ్య చర్చల ఫలితాలపై ఇన్వెస్టర్ల ఎదురుచూపులు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. ఇటీవల అమెరికా విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో ఆర్థిక వృద్ధి మందగించిందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పసిడి...సాంకేతికంగా 1,350 - 1,360 డాలర్ల స్థాయిలో కీలక అవరోధం కలిగి ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
దేశీయంగానూ స్వల్ప లాభమే..!
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర స్వల్పంగా లాభపడింది. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.68లు లాభపడి రూ.33517.00 వద్ద ముగిసింది. ఈ వారంలో డాలర్‌ మారకంలో రూపాయి అస్థిరత కారణంగా పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికి, ఈ వారం మొత్తం మీద పసిడి రూ.127ల స్వల్పలాభాన్ని ఆర్జించడం విశేషం.



You may be interested

మోతీలాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌లకు సెబీ షాక్‌

Saturday 23rd February 2019

సెక్యూరిటీ అండ్‌ ఎక్చ్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలైన మోతీలాల్‌ ఓస్వాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌(ఐఐఎఫ్‌ఎల్‌)లకు షాక్‌నిచ్చింది. ఈ రెండు సంస్థలకు చెందిన కమోడిటీ విభాగాలకు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేసే అర్హత లేదని వెల్లడించింది. రూ.5,600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్‌ కేసు దర్యాప్తులో భాగంగా సెబీ ఈ విషయాన్ని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు చెందిన మోసపూరిత కాంట్రాక్టుల విక్రయాలకు ఆ రెండు సంస్థలు ఉద్దేశపూర్వకంగా సహకరించాయి. ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ విధానంలో నమ్మకం

స్వల్పలాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd February 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి స్వల్ప లాభంతో 10,809.50 వద్ద  ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10808.80 పాయింట్లతో పోలిస్తే కేవలం 0.75 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ దాదాపు ఫ్లాట్‌గా ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 5శాతం అప్‌:-  అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌)

Most from this category