STOCKS

News


పసిడి లాభాల ర్యాలీ

Tuesday 12th March 2019
Markets_main1552373880.png-24544

డాలర్‌ ఇండెక్స్‌ పతనం పసిడి ధరకు కలిసొస్తుంది. ఆసియా మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 6డాలర్ల పెరిగింది. బ్రెగ్జిట్‌ డీల్‌ కీలక సవరణకు యూరోపిన్‌ కమీషన్‌ సోమవారం అంగీకారం తెలపడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడింది. అలాగే పసిడి ధర 1300డాలర్ల దిగువకు ట్రేడ్‌ అవుతుండటం కూడా ఇన్వెస్టర్లను పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు పురిగొల్పింది. ఈ నేపథ్యంలో నేడు ఔన్స్‌ పసడి ధర 6.25 డాలర్లు లాభపడి 1,297.35 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 5డాలర్ల లాభంతో 1,296.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే  ‘‘బ్రెగ్జిట్‌ డీల్‌ ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి అయ్యే అవకాశముండటంతో పసిడి లాభాలు పరిమితయ్యాయి. సాంకేతికంగా పసిడికి 1301డాలరు వద్ద కీలక నిరోధ స్థాయి ఉంది. ఒకవేళ ఆ నిరోధక స్థాయిని అధిగమించగలిగితే 1,307-1,313 డాలర్ల రేంజ్‌లో పసిడి కదలాడే అవకాశం’’ ఉందని రాయిటర్‌ కమోడిటీ విశ్లేషకుడు చెప్పుకొచ్చారు.
దేశీయంగా స్వల్ప పెరుగుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీ లాభపడినప్పటికి, దేశీయ బులియన్‌ మార్కెట్‌ మార్కెట్లో మాత్రం స్వల్పంగానే లాభపడింది. నేడు డాలర్‌ మారకంలో బలపడటం దేశీయంగా పసిడి ర్యాలీకి అవరోధంగా నిలిచింది. ఎంసీక్స్‌లో ఉదయం గం.11:45ని.లకు 10గ్రాముల పసిడి ధర రూ.38లు స్వల్పంగా లాభపడి రూ. 31934.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

క్రెడిట్‌ కార్డు... తీసుకుంటే లాభమే!

Tuesday 12th March 2019

వడ్డీ లేకుండా రుణం సకాలంలో చెల్లింపులు చేసే వారికే అనుకూలం అత్యవసరాల్లో ఆదుకునే సాధనం ఆన్‌లైన్‌ షాపింగ్‌లు, బిల్లుల చెల్లింపులపై తగ్గింపులు మరెన్నో ఇతర ప్రయోజనాలు గడువులోపు చెల్లించకపోతే మాత్రం భారీ వడ్డీ క్రెడిట్‌ కార్డుల్లో ఎన్నో రకాలు ఎవరికి వారు తమకు అనువైనదే ఎంచుకోవాలి సకాలంలో బకాయిలు చెల్లించాలి క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉంటే కార్డుకు తిరస్కారం క్రెడిట్‌ కార్డులో అధిక చార్జీలు ఉంటాయని, రుణ భారంలో చిక్కుకుంటామన్న అభిప్రాయాలతో చాలా మంది వీటిని తీసుకునేందుకు సుముఖత చూపరు. కానీ, నాణేనికి ఇది

20 స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌!

Tuesday 12th March 2019

దేశీయ సూచీల్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 20 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, బయోకాన్‌, జీఎస్‌కే ఫార్మా, డాబర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఆదిత్య బిర్లా

Most from this category