STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Saturday 9th February 2019
Markets_main1549711481.png-24112

ప్రపంచమార్కెట్లో పసిడి ధర వారంతపు రోజైన శుక్రవారం 4.50డాలర్లు లాభపడింది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,318.50 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఆర్థికవృద్ది మందగమనం ఆందోళనలు మరోసారి తెరపైకి రావడంతో పాటు ప్రపంచమార్కెట్లలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దేశాధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ది రోజ్‌ గార్డెన్‌లో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో గోడ నిర్మాణంపై డెమోక్రాట్లు తమ పంథాను విడకపోతే ప్రభుత్వాన్ని మరోసారి మూసివేయడానికి తాను సిద్ధం ఉన్నట్లు ట్రంప్‌ తెలిపారు. అవసరమైతే అత్యవసర పరిస్థితి విధించి మరీ నిధులు మంజూరు చేస్తానని ట్రంప్‌ ప్రకటించారు. యూరోజోన్‌లో రగిలిన బ్రెగ్జిట్‌ మంటలు ఇంకా చల్లారలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. అలాగే లునాన్‌ కొత్త సంవత్సరం సందర్భంగా వారం రోజులుగా సెలవులో ఉన్న చైనా మార్కెట్‌ సోమవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగి ఇంట్రాడేలో 5.50డాలర్లు లాభపడి 1,319.45 డాలర్ల గరిష్టానికి చేరుకుంది చివరి 1,318.50 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పసిడి:-
ప్రపంచమార్కెట్లో పసిడి ఓ మోస్తారులో లాభపడినప్పటికి.., దేశీయ బులియన్‌ మార్కెట్లో సైతం స్వల్పంగా పెరిగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో రాత్రి ఔన్స్‌ పసిడి ధర రూ.73.00లు లాభపడి రూ.33242.00ల వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 13పైసలు బలపడటంతో బులియన్‌ మార్కెట్లో పసిడి ర్యాలీకి ప్రతికూలంగా మారినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

 



You may be interested

ఎంఎఫ్‌లకు క్రిసిల్‌ ర్యాకింగ్‌లు

Saturday 9th February 2019

గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. లిక్విడిటీపై ఆందోళన, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితులు.. ఈక్విటీలపై ప్రభావం చూపాయి. దీంతో చాలా మ్యూచువల్‌ ఫండ్స్‌ పేలవ ప్రదర్శన చూపాయి. డిసెంబర్‌ నాటికి ఎంఎఫ్‌లు చూపిన ప్రదర్శన ఆధారంగా 474ఫండ్స్‌కు క్రిసిల్‌ ర్యాంకులిచ్చింది. ఇందులో 211 ఎంఎఫ్‌లు ఈక్విటీ ఫండ్స్‌ కాగా, 215 డెట్‌, 48 హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ర్యాంకింగ్‌లో యాక్సి్‌స్‌ ఎంఎఫ్‌, కోటక్‌ మహీంద్రా ఎంఎఫ్‌లు తమ

ఇంటి రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు

Saturday 9th February 2019

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రకటించిన అనంతరం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ తగ్గింపును కస్టమర్లకు చేరవేసే దిశగా నిర్ణయం తీసుకుంది. 30 లక్షల రూపాయల వరకు తీసుకున్న గృహరుణాలపై వడ్డీరేటును ఐదు బీపీఎస్‌ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రస్తుత హోమ్‌లోన్‌ మార్కెట్‌లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. కస్టమర్లకు, ముఖ్యంగా మధ్యతరగతికి ప్రయోజనం కలిగేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యల ఫలితాలు  కస్టమర్లకు చేరవేసేందుకు యత్నిస్తున్నాం.’అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

Most from this category