STOCKS

News


మూడోరోజూ లాభాల్లోనే

Tuesday 19th March 2019
Markets_main1552975020.png-24680

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మూడో రోజూ లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర మంగళవారం 6డాలర్లు పెరిగింది. నేటి నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. రేపటితో ముగిసే ఈ సమావేశంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ సోమవారం 2-వారాల కనిష్టానికి పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌కు వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడికి ఈ అంశం కలిసొచ్చింది. అలాగే ఫెడ్‌ సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మ ధోరణి వ్యవహరిస్తూ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా నేడు ఆసియాలో  ఔన్స్‌ పసిడి 6డాలర్లు ర్యాలీ చేసి 1,307.65 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:45ని.లకు 5డాలర్ల లాభంతో 1,306.45 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిసిన నేపథ్యం‍లో అక్కడ పసిడి  1,301.50 వద్ద ముగిసింది. 
దేశీయంగా స్వల్ప పెరుగుదలే:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీ లాభపడినప్పటికీ, దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. డాలర్‌ మారకంలో బలపడటం పసిడి ఇక్కడ ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.75లు పెరిగి 31727ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్‌!

Tuesday 19th March 2019

- సోమవారం ఒక్కరోజే  57పైసలు లాభం - 68.53 వద్ద ముగింపు - ఏడు నెలల గరిష్టం న్యూఢిల్లీ: రూపాయి అప్రతిహత పురోగమనం కొనసాగుతోంది. సోమవారం వరుసగా ఆరవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో 57 పైసలు లాభపడింది. 68.53 వద్ద ముగిసింది.  ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది.  2018 ఆగస్టు 1వ తేదీన రూపాయి ముగింపు 68.43. అప్పటి తర్వాత

భారత్‌కు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌

Tuesday 19th March 2019

గోల్డ్‌మన్‌ సాక్స్‌ నిర్ణయం భారత మార్కెట్‌ రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రకటించింది. దీంతో పాటు నిఫ్టీ ఏడాది టార్గెట్‌ను 12500 పాయింట్లుగా నిర్ణయించింది. మార్చి ఆరంభం నుంచి దేశ మార్కెట్లు కీలక నిరోధాలు దాటి పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ 38వేల పాయింట్లను, నిఫ్టీ 11400 పాయింట్లను దాటేశాయి. ఈ ర్యాలీ ఎఫ్‌ఐఐల కారణంగా ఏర్పడిన ప్రీఎలక‌్షన్‌ ర్యాలీ అని గోల్డ్‌మన్‌సాక్స్‌ తెలిపింది. మార్చిలో

Most from this category