STOCKS

News


ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కోసం పసిడి ఎదురుచూపులు

Tuesday 27th November 2018
Markets_main1543301450.png-22414

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కోసం పసిడి చూస్తోంది. ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.11:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర అరడాలర్‌ నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గురువారం ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ విడుదల సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగంలో కీలక వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచితే డాలర్‌ మరింత బలపడి పసిడి.. కరెక‌్షన్‌ బాట పట్టవచ్చనేది విశ్లేషకుల అంచనా. మరోవైపు ముడిచమురు ధరలు, డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీకి కూడా పసిడి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. రాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల ముగింపు నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,222.50 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ పసిడి ధర:-
దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధరలు అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఏడు రోజుల ర్యాలీకి అడ్డుకట్టపడటం దేశీయ పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతుంది. ఎంసీక్స్‌లో ఉదయం గం.11:00ని.లకు 10గ్రాముల పసిడి రూ.24లు స్వల్పంగా లాభపడి రూ.30574ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి డాలర్‌ మారకం విలువలో రూపాయి బలహీనపడటంతో రూ.38లు లాభపడి రూ.30547ల వద్ద ముగిసింది.



You may be interested

నవంబర్‌ సిరీస్‌లో 10,743 పాయింట్లకు నిఫ్టీ..!

Tuesday 27th November 2018

ముంబై: మరో రెండు రోజుల్లో నవంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగియనుండగా.. ఈ సిరిస్‌ క్లోజింగ్‌ సమయానికల్లా నిఫ్టీ 10,743 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని డెరివేటీవ్‌ అనలిస్టులు భావిస్తున్నారు. 200-రోజుల సాధారణ సగటు కదిలికల స్థాయి ఇక్కడ ఉన్నందున సిరీస్‌ ముగిసే సమయానికి నిఫ్టీ ఈ స్థాయిని తిరిగి పరీక్షించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. సోమవారం చోటుచేసుకున్న 139 పాయిం‍ట్ల రికవరీ వీరి అంచనాలకు మరింత బలంచేకూర్చింది.

రూ.750 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు హెచ్‌ఈజీ బోర్డు ఆమోదం

Tuesday 27th November 2018

న్యూఢిల్లీ: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌లు తయారు చేసే హెచ్‌ఈజీ కంపెనీ రూ.750 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. సోమవారం జరిగిన  డైరెక్టర్ల బోర్డ్‌ ఈ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపిందని హెచ్‌ఈజీ వెల్లడించింది. మరోవైపు ఉత్పత్తి పెంపునకు సంబంధించిన రూ.1,200 కోట్ల మూలధన పెట్టుబడుల ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది. ఈ​ప్రతిపాదనలో భాగంగా  ప్రస్తుతం 80,000 టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 20,000 టన్నులు పెంచనున్నామని

Most from this category