STOCKS

News


వారం గరిష్టం వద్ద పసిడి

Wednesday 3rd October 2018
Markets_main1538545109.png-20815

ముంబై:- ఇటలీ బడ్జెట్‌ సంక్షోభంతో బుధవారం పసిడి ధర పరుగులు పెడుతోంది. అసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి వారం రోజుల గరిష్ట వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ఈ ఏడాది ఇటలీలో అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం ఈయూ(యూరోపియన్‌ యూనియన్‌) ఆర్థిక నియమాళిని ఉల్లంఘిస్తూ భారీ​బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈయూ ఇటలీ ఆర్థిక విధానాలను మార్చుకోవాల్సిందిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 25డాలర్లు పెరిగి ఇంట్రాడేలో 1,212.30 డాలర్ల వద్ద వారం గరిష్టానికి తాకింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 22డాలర్లు(1.88శాతం) లాభపడి 1209.40 వద్ద ముగిసింది. అక్కడి లాభాల ర్యాలీని అందుకున్న పసిడి ఆసియా ట్రేడింగ్‌లోనూ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:30లకు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 2.80 డాలర్లు లాభపడి 1,209.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా రూ.31వేల పైకి:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి వారం గరిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతుండంతో పాటు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనతలు దేశీయంగా పసిడి ధరకు కలిసి వస్తుంది. ఫలితంగా దేశీయ మార్కెట్లో బుధవారం పసిడి ధర రూ.31వేల పైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయంగం.10:30ని.లకు 10గ్రాముల పసిడి రూ.419.00 లాభపడి రూ.31011.00ల వద్ద ముగిసింది.



You may be interested

ఇచ్చిన అప్పులో 10- 15 శాతం ఆవిరి?!

Wednesday 3rd October 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు బ్యాంకులిచ్చిన రుణాలపై అంచనా రుణభారంతో సతమతమవుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఎస్‌బీఐ, బీఓఐ, పీఎన్‌బీ తదితర బ్యాంకులన్నీ కలిపి దాదాపు 35వేల కోట్ల రూపాయల మేర అప్పులిచ్చిఉన్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2,388 కోట్ల రూపాయల మేర కంపెనీకి రుణాలిచ్చింది. తాజాగా ప్రభుత్వం కంపెనీ పరిస్థితి చక్కదిద్దేందుకు మేనేజ్‌మెంట్‌లో పలు కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా తమ రుణాలు వసూలయ్యే ఛాన్సులు కాస్త మెరుగుపడ్డాయని బ్యాంకులు భావిస్తున్నాయి.

ఈ-గ్రోసరీ స్పేస్‌లో హోరాహోరీ

Wednesday 3rd October 2018

ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఈ-గ్రోసరీ సెగ్మెంట్‌ఈ-గ్రోసరీ సెగ్మెంట్‌ (ఆన్‌లైన్‌ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్‌ ఆర్డర్‌ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్‌ కేక్‌. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ-గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, -మార్కెట్‌ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ

Most from this category