STOCKS

News


అక్కడక్కడే పసిడి ధర

Saturday 12th January 2019
Markets_main1547286211.png-23552

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర అక్కడక్కడే ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి 2డాలర్లు (0.50డాలరు) స్వల్పంగా పెరిగి 1,289.50 డాలర్ల వద్ద స్థిరపడింది. నాలుగురోజుల పాటు అమెరికా-చైనా దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఎలాంటి సమాచారం వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లలో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమై ఉంచవచ్చనే అనుమానాలు రేకత్తాయి. అలాగే గత 5రోజులుగా ర్యాలీ చేస్తున్న అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగియండంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తూ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌ పసిడి ధర ఒకనొకదశలో పసిడి ధర 8.50డాలర్లు లాభపడి 1,295.70డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే అనూహ్యంగా డాలర్‌ ఇండెక్స్‌ 7నెలల కనిష్టస్థాయి నుంచి పుంజుకుని 95స్థాయిని అందుకోవడంతో పసిడి ధరపై ఒత్తిడి పెరిగింది. అలాగే సాంకేతికంగా పసిడి 1300డాలర్ల వద్ద బలమైన నిరోధస్థాయిని కలిగి ఉండటంతో పసిడి ప్రతికూలంగా మారింది. వెరిసి రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి కేవలం 2డాలర్లు లాభపడి 1287.85 వద్ద స్థిరపడింది. పసిడి వరుసగా నాలుగోవారం లాభాల్లో(4డాలర్లు) ముగిసింది. ఈ వారంలో 1,280.20 - 1,298.00 రేంజ్‌లో ట్రేడైంది.
మరో 3నెలల్లోగా 1300 డాలర్లకు పసిడి: గోల్డ్‌మెన్‌ శాచ్స్‌
ఆర్థిక మాంద్యపు అలజడి ఈ ఏడాది ప్రారంభంలోనూ కొనసాగవచ్చని, తద్వారా పసిడికి డిమాండ్‌ పెరిగి మరో 3నెలల్లోగా 1300 డాలర్ల స్థాయికి గోల్డ్‌మెన్‌ శాచ్స్‌ అభిప్రాయపడింది. ‘‘సంక్షోభం సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లు’’ అనే అంశం పసిడి ధరకు మద్దతునిస్తుందని గోల్డ్‌ శాచ్స్‌ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లు మందగమనంతో ఉండటం, ముడి చమురు అస్ధిరత, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొనడంతో పలు దేశాలకు చెందిన సెం‍ట్రల్‌ బ్యాంకులు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతాయి. వచ్చే మూడునెలల్లో ఔన్స్‌ పసిడి ధర 1325 డాలర్లకు, మరో 6నెలల్లో 1375డాలర్లకు, అలాడే వచ్చే ఏడాదిలో 1425 డాలర్లకు చేరవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.
దేశీయంగా కలిసొచ్చిన రూపాయి బలహీనత:-
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ర్యాలీ కారణంగా ఈ వారంలో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత పసిడి ధరకు కలిసొచ్చింది. ఫిబ్రవరి కాంట్రాక్టు ధర ఈ వారంలో ఒకానొకదశలో రూ.32వేల స్థాయిని అందుకుంది. వారం మొత్తం మీద రూ.472లు లాభపడింది.  శుక్రవారం రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 8పైసలు క్షీణించడంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో రూ.48.00లు లాభపడి రూ.31928.00ల వద్ద స్థిరపడింది.You may be interested

నిఫ్టీ బ్రేకవుట్‌కు రెడీ అవుతోందా?

Saturday 12th January 2019

గత కొన్నాళ్లుగా నిఫ్టీ స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోంది. గతేడాది జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన అనంతరం మరోమారు పదివేల పాయింట్ల వరకు పతనమైంది. అక్కడ నుంచి మరోమారు పైకి ఎగిసినా పరుగు కొనసాగించలేక, కిందకు రాలేక ఒక రేంజ్‌లోనే కదలాడుతోంది. చార్టులను పరిశీలిస్తే కరెక్టివ్‌ అప్‌మూవ్‌లో భాగంగానే తాజా ర్యాలీ వచ్చింది కానీ కొత్త బుల్‌ ర్యాలీ మాత్రం కాదని తెలుస్తోంది. నియో వేవ్‌ సిద్ధాంతం ప్రకారం చూస్తే గతనెల

ఈవారంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేసిన షేరు ఇదే..!

Saturday 12th January 2019

నిర్మాణ రంగంలో 99 ఏళ్లుగా సేవ‌లు అందిస్తున్న ఇండియన్‌ హ్యూమ్ పైప్‌(ఐహెచ్‌పీ) షేరును కొనవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్రోక‌రేజ్ సంస్థ సిఫార్సు చేస్తుంది. రంగం:- నిర్మాణ రంగం రేటింగ్‌:- బై టార్గెట్ ధ‌ర‌:- రూ.445లు విశ్లేషణ:- డ్రైనేజీ, ఇరిగేష‌న్‌, తాగునీటి స‌ర‌ఫ‌రా రంగంలో దేశంలోనే ప్రథ‌మస్థానంలో ఉంది. కంపెనీ 2018 ఆర్థిక సంవ‌త్సరం నాటికి రూ.1000 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. అక్టోబ‌ర్ 2018 నాటికి కంపెనీ రూ.3737 కోట్ల విలువైన బుక్ ఆర్డర్లను క‌లిగి ఉంది.

Most from this category