STOCKS

News


తగ్గిన పసిడి

Thursday 17th January 2019
Markets_main1547705274.png-23635

గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణతో గురువారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సైతం పసిడికి ప్రతికూలాంశంగా మారింది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 5డాలర్ల వరకు నష్టపోయింది. ఉదయం గం.10:45ని.లకు పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,291.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌ సమస్యతో ఐరోపాలో, ప్రభుత్వం షట్‌డౌన్‌ అంశంతో అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై యదాతథ అంచనాల నేపథ్యంలో పసిడి క్రితం ట్రేడింగ్‌లో 7.50డాలర్లు పెరిగి 1295 డాలర్ల గరిష్టానికి తాకింది. చివరి రాత్రి అమెరికాలో 1,293.80 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడం సైతం పసిడి పతనానికి కారణమైందని చెప్పవచ్చు. పసిడి ధర 5 గతవారాలుగా బలపడుతూ వస్తుంది. చివరి రెండు వారాలుగా 20డాలర్ల రేంజ్‌లో ఒడిదుడుకులకు లోనవుతోంది. పసిడికి సాంకేతికంగా కీలకమైన 1300 డాలర్ల నిరోధస్థాయిని అధిగమించలేకపోతుంది. పసిడి 1275- 1300డాలర్ల మధ్యలో మరి కొంతకాలం కన్సాలిడేషన్‌కు గురిఅవుతోందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగా స్వల్పంగా పెరుగుదల:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టినప్పటికీ.., దేశీయంగా మాత్రం స్వల్పంగా లాభపడింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఎంసీక్స్‌ మార్కెట్లో ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర రూ.51.00లు లాభపడి రూ.32337.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

నెల రోజులకు సాంక్టమ్‌ సిఫార్సులు

Thursday 17th January 2019

వచ్చే నెల రోజుల్లో 5- 15 శాతం రాబడినిచ్చే ఐదు షేర్లను కొనొచ్చని సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. దివీస్‌: టార్గెట్‌ రూ. 1700. స్టాప్‌లాస్‌ రూ. 1455. చార్టుల్లో హయ్యర్‌ టాప్స్‌, హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తోంది. గత నవంబర్‌లో ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం కన్సాలిడేషన్‌లోకి వెళ్లింది. చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ ఏర్పరిచి తాజాగా దాన్నుంచి బ్రేకవుట్‌ సాధించింది. వాల్యూంలు కూడా అప్‌ట్రెండ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2.

51 శాతం పెరిగిన డీసీబీ బ్యాంక్‌ లాభం

Thursday 17th January 2019

- మొత్తం ఆదాయం 27 శాతం అప్‌ న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ డీసీబీ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 51 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.57 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లకు ఎగసిందని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు జోరుగా పెరగడంతో ఈ స్థాయి నికర లాభం

Most from this category