STOCKS

News


వారం కనిష్ట ధర వద్ద ముగిసిన పసిడి

Saturday 22nd September 2018
Markets_main1537598399.png-20479

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఈవారం చివరి రోజైన శుక్రవారం ‘‘వారం కనిష్ట ధర’’ వద్ద స్ధిరపడింది. బ్రెగ్జిట్‌ అందోళనలతో పాటు, వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడం, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలు బలపడటం ఇందుకు కారణమయ్యాయి.  అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి 10.30డాలర్ల నష్టపోయి 1201.30 డాలర్ల వద్ద ముగిసింది. బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే శుక్రవారం ‘‘బ్రిటన్‌ ఐరోపా కూటమి నుంచి వైదొలగే ప్రక్రియకు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) సరియైన సహకారం అందించడంలేదని వాఖ్యానించింది. థెరిస్సా ఆరోపణలతో బ్రిటన్‌ స్టెర్లిoగ్‌తో పాటు యూరో కరెన్సీలల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా చైనాకు చెందిన 200 మిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10శాతం టారీఫ్‌ వచ్చేవారం(సోమవారం) నుంచి అమల్లోకి రానునుండటంతో డాలర్‌కు కొనుగోళ్లకు మద్దతు పెరిగింది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వచ్చే వారంలో జరిగే సమీక్ష సమావేశాల్లో కీలక వడ్డీ రేట్ల పెంచువచ్చనే అంచనాలు బలపడం కూడా డాలర్‌కు బలాన్నిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో  శుక్రవారం రాత్రి ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 94.33స్థాయికి చేరుకుంది. డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ కారణంగా పసిడి ఫ్యూచర్లలో అమ్మకాలు పెరిగాయి.
దేశీయంగా స్వల్ప తగ్గుదల:-
దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ పసిడి భారీ పతనాన్ని అడ్డుకుంది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ ముగింపు సమయానికి 10 గ్రాముల పసిడి రూ.17.00లు నష్టపోయి రూ.30582.00 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ వారం పిక్‌: మహీంద్రా లైఫ్‌స్పేస్‌

Saturday 22nd September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ను ఈ వారం స్టాక్‌ పిక్‌గా సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ ఇండస్ట్రీ: రియల్‌ ఎస్టేట్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.466 టార్గెట్‌ ప్రైస్‌: రూ.565 బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. రియల్టీ కంపెనీ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. వచ్చే 4-6 త్రైమాసికాల్లో

ఎంఎం ఫోర్జింగ్స్‌పై బుల్లిష్‌

Saturday 22nd September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎంఎం ఫోర్జింగ్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఎంఎం ఫోర్జింగ్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.588 టార్గెట్‌ ప్రైస్‌: రూ.809 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. ఎంఎం ఫోర్జింగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.809గా నిర్ణయించింది. బై రేటింగ్‌ ఇచ్చింది. ఎంఎం ఫోర్జింగ్స్‌.. తను కార్యకలాపాలు అందించే విభాగంలో పెద్ద కంపెనీగా అవతరించడానికి

Most from this category