News


పసిడి 4వారాల ర్యాలీకి బ్రేక్‌..!

Saturday 3rd November 2018
Markets_main1541229254.png-21678

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ ఆక్టోబర్‌ నెల ఉద్యోగ గణాంకాలను అమెరికా వెల్లడించింది. మార్కెట్‌ వర్గాల అంచనాలను మించి ఆర్థికవ్యవస్థలో నూతనంగా 2.5లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. అధిక ఉద్యోగకల్పనతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెరుగుతాయి. తద్వారా ట్రెజరరీ ఈల్డ్‌తో పాటు డాలర్‌ విలువ కూడా పెరుగుతుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 96.59స్థాయిని తాకింది. మరోవైపు చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదాలు త్వరలో సమిసిపోతాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేయడంతో వాణిజ్యయుద్ధ భయాల ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1.40డాలర్లు నష్టపోయి 1,234.60 ముగిసింది.
4వారాల ర్యాలీ బ్రేక్‌:-
గత 4వారాలు లాభాలతో ముగిసిన పసిడి ధర ఈ ఐదోవారంలో నష్టాలతో ముగిసింది. ఈ వారంలో డాలర్‌ ర్యాలీ కారణంగా మొదటి 3రోజులు నష్టాలపాలైంది. ఈ క్రమంలో బుధవారం 1,212 డాలర్ల కనిష్టాన్ని తాకింది. అయితే అనూహ్యంగా అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధభయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు, అమెరికాలో జరగున్న మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ ప్రతిపక్షపార్టీ డెమోక్రటిక్‌ పార్టీ విజయం సాధించవచ్చనే అంచనాలు పసిడి ధరను నడిపించాయి. గురువారం (నవంబర్‌ 1వ తేదీ) 1,236 డాలర్ల వద్ద గరిష్టస్థాయిని అందుకుంది. చివరకి 4వారాల లాభాల ముగింపునకు బ్రేక్‌ వేస్తూ 0.13శాతం నష్టంతో 1,234.60 వద్ద స్థిరపడింది.
దేశీయంగా తగ్గుదలే:-
ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి ర్యాలీ కారణంగా ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ధర వన్నె తగ్గింది. డాలర్‌ మారకంలో రూపాయి శుక్రవారం ఇంట్రాడేలో 100 పైసలు బలపడి 72.42 వద్ద సెప్టెంబర్‌ 19నాటి కనిష్టాన్ని తాకింది. ఫలితంగా ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర ఇంట్రాడేలో రూ.31,600 వద్ద మూడువారాల కనిష్టానికి పతనమైంది. చివరికి రూ.128ల నష్టంతో రూ.31764ల వద్ద ముగిసింది. వచ్చే వారంలో ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి రూ.31,539-31,825 రేంజ్‌లో కదలాడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.You may be interested

గంటలో రూ.కోటి రుణం

Saturday 3rd November 2018

చిన్న సంస్థల రుణావసరాల కోసం ప్రభుత్వ పోర్టల్‌ ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు- ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ పలు చర్యలు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ. 1 కోటి దాకా రుణాలు పొందగలిగేలా ప్రత్యేక పోర్టల్‌ను (www.psbloanin59minutes.com) శుక్రవారం ఆవిష్కరించారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)లో నమోదు చేయించుకున్న ఎంఎస్‌ఎంఈలు

నిఫ్టీ చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌..!

Saturday 3rd November 2018

10,700–10,850 స్థాయికి చేరువలో నిఫ్టీ 50 ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం నాడు 10,380 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ వారాంతం రోజున 10,462 పాయిం‍ట్ల వద్ద గ్యాప్‌ అప్‌తో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 10,606.95 పాయింట్ల గరిష్టస్థాయికి చేరుకునప్పటికీ.. ట్రేడింగ్‌ చివరిలో ఎదురైన అమ్మకాల ఒత్తిడితో 10,553 వద్ద ముగిసింది. 173 పాయింట్ల(1.66 శాతం) లాభపడింది. ఫండమెంటల్‌గా చూస్తే.. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం

Most from this category