News


మళ్లీ 1300 డాలర్ల దిగువకు పసిడి

Friday 15th March 2019
Markets_main1552630103.png-24624

ప్రపంచమార్కెట్లో పసిడి ధర తిరిగి 1300డాలర్ల దిగువకు చేరుకుంది. యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ ఒ‍ప్పంద ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ పసిడి ధరపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్‌ నిష్క్రమించాలనే ప్రతిపాదన బ్రిటన్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌లో వీగిపోయింది. మరోవైపు ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ ఐదురోజుల తర్వాత తిరిగి పుంజుకోవడం పసిడికి ప్రతికూలాంశగా మారింది. ఫలితంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల దిగువన 1,295.10 ముగిసింది. అయితే, నేటి ఆసియా ట్రేడింగ్‌లో మాత్రం స్వల్పంగా లాభపడింది. క్రితం రోజు భారీగా నష్టపోయిన నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. యెన్‌ బలపడటంతో డాలర్ నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు మరోసారి తెరపైకి రావడం పసిడికి రికవరీకి కలిసొస్తుంది. ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర 3.25 డాలర్లు పెరిగి 1,298.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
స్థిరంగా పసిడి ధర:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రికవరీ బాట పట్టినప్పటికీ.., దేశీయ బులియన్‌ మార్కెట్లో మాత్రం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం పసిడి ర్యాలీకి అడ్డుకుంటుంది. ఉదయం గం.11:15ని.లకు ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.12లు స్వల్పంగా పెరిగి రూ.31820.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

వరల్డ్‌ టాప్‌ 75 కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌

Friday 15th March 2019

ప్రపంచంలో మార్కెట్‌క్యాప్‌ పరంగా టాప్‌ 75 కంపెనీల్లోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేరింది. దాదాపు 12300 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో ఆర్‌ఐఎల్‌ ఈ జాబితాలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ టాప్‌ 75 కంపెనీల సరాసరి మార్కెట్‌ క్యాప్‌ విలువ 16100 కోట్ల డాలర్లు. గతేడాది కాలంలో ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు 45 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచంలో గతేడాది మంచి రాబడులు ఇచ్చిన టాప్‌ 100 కంపెనీల్లో మూడో

50వేల పాయింట్లు పక్కా!

Friday 15th March 2019

సెన్సెక్స్‌పై నిపుణుల అంచనా మార్కెట్లో బుల్‌రన్‌ దీర్ఘకాలం కొనసాగుతుందని, వచ్చే దశాబ్దంలో సెన్సెక్స్‌ తప్పక 50వేల పాయింట్ల మైలురాయిని దాటేస్తుందని పలువురు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2009లో ఆరంభమైన బుల్‌రన్‌ ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకుందని మోర్గాన్‌స్టాన్లీ నివేదిక తెలిపింది. దేశ ఈక్విటీ చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘమైన, నెమ్మదైన బుల్‌పరుగని తెలిపింది. ఈ పరుగులో మార్కెట్‌ పదేళ్లలో సరాసరిన 16 శాతం వార్షిక రాబడినిచ్చింది. ఈ ఏడాది

Most from this category