STOCKS

News


కోలుకున్న పసిడి ధర

Saturday 29th September 2018
Markets_main1538201941.png-20706

డాలర్‌ ఇండెక్స్‌ తాజాగా నెలరోజుల కనిష్టానికి చేరుకోవడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర కోలుకుంది. అమెరికా మార్కెట్‌ ముగింపు సమయానికి ఔన్స్‌ పసిడి 8.80 డాలర్లు లాభపడి 1,196.20 వద్ద ముగిసింది. గతరోజు ఉదయం ట్రేడింగ్‌లో 6వారాల కనిష్ట ధర వద్ద ట్రేడైన సంగతి తెలిసిందే.

  •     వారం వారీగా చూస్తే ఔన్స్‌ పసిడి 4.70డాలర్లు (-0.39శాతం) నష్టపోయింది.
  •    నెలవారీగా చూస్తే సెప్టెంబర్‌లో 4.10 డాలర్లు (-0.34శాతం) నష్టపోయింది. 
  •  పసిడికి వరుసగా 6నెల పతనం నష్టాల ముగింపు.

‘‘డాలర్‌ పతనం పసిడి ధర పుంజుకోవడానికి కారణమైంది. వచ్చే వారంలో అమెరికా విడుదల చేసే మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ సర్వీస్‌(పీఐఎం), యూఎస్‌ ఉదోగ్య గణాంకాలపై పసిడి ట్రేడింగ్‌ ఆధారపడి ఉంటుంది’’ అని విశ్లేషకులంటున్నారు.
దేశీయంగా పెరుగుదలే:-
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ కారణంగా దేశీయంగా పసిడి ధర పెరిగింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి ధర రూ.184.00లు లాభపడి రూ.30508ల వద్ద ముగిసింది.



You may be interested

వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!

Saturday 29th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘నిరంతర విద్యార్థి’.. ఇది వైద్యులకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే? వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన శస్త్ర చికిత్స విధానాలు, మెడికల్‌ టెక్నాలజీ, వ్యాధులు, చికిత్స మార్గాలు వంటివి నేర్చుకుంటూ ఉండాలి. మరి డాక్టర్లు వృత్తిని వదిలి.. పుస్తకాలు పట్టుకొని రోజూ శిక్షణ తరగతులకు వెళ్లాలా? అవసరమే లేదంటోంది బెంగళూరుకు చెందిన మెడినిట్‌. జస్ట్‌! వైద్యులు మెడినిట్‌లో నమోదైతే చాలు.. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, వైద్య వర్సిటీలు,

భారత్‌ విదేశీ మారక నిల్వలు 402 బిలియన్‌ డాలర్లు

Saturday 29th September 2018

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు సెప్టెంబర్‌ 21వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా 1.3 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. దీనితో మొత్తంగా 401.79 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  విదేశీ మారక నిల్వలు 2018 ఏప్రిల్‌ 13తో ముగిసిన వారంలో 426.02 బిలియన్‌ డాలర్లతో రికార్డు స్థాయికి చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులతో ప్రస్తుత స్థాయికి తగ్గుతూ వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల

Most from this category