STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Thursday 27th December 2018
Markets_main1545886497.png-23259

ప్రపంచమార్కెట్లో గురువారం పసిడి ధర 1270డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థితర, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు పసిడి ర్యాలీకి మద్దతనిస్తున్నాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,272.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఈక్విటీ షేర్లతో పాటు ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌‍్స పెరగడంతో డాలర్‌ ఇండెక్స్‌ 4నెలల కనిష్టం నుంచి కోలుకోవడంతో పసిడి ఆశించిన స్థాయిలో ర్యాలీ చేయకలేపోయింది. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి కేవలం 1డాలర్‌ మాత్రమే లాభపడి 1,269.75 డాలర్‌ వద్ద ముగిసింది.
దేశీయంగా లాభనష్టాల మధ్య ఊగిసలాట:-
ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, అమెరికాలో రాజకీయ అస్థితర అంశాలతో అంతర్జాతీయమార్కెట్లో పసిడి ర్యాలీకి సిద్ధమైనప్పటికీ.., దేశీయ బులియన్‌ మార్కెట్లో మాత్రం స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి ఒడిదుడుకుల ప్రయాణం పసిడికి ఆస్థితరకు కారణమవుతోంది. ఎంసీఎక్స్‌లో  ఉదయం గం.10:00లకు 10గ్రాములు పసిడి ధర రూ.6.00 నష్టంతో రూ.31553.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఆర్జించిన లాభాలన్నీ ఈ ఉదయం హరించుకోవడంతో పసిడి ధరకు కలిసొచ్చింది. రాత్రి ఎంసీఎక్స్‌లో మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.99లు లాభపడి రూ.31559ల వద్ద స్థిరపడింది.



You may be interested

ఐటీ షేర్లు జంప్‌

Thursday 27th December 2018

కలిసొచ్చిన రూపాయి పతనం డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గముఖం పట్టడంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీ షేర్లు మార్కెట్‌ ర్యాలీకి దున్నుగా నిలిచిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతానికి లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ముడిచమురు ధరల 5శాతం రిలీఫ్‌ ర్యాలీ, డాలర్‌ ఇండెక్స్‌ 4 నెలల కనిష్టం నుంచి కోలుకోవడం తదితర కారణాలతో

4 ఏళ్లలో 47 శాతం వృద్ధి

Thursday 27th December 2018

- పెరుగుతున్న సీఎస్‌ఆర్‌ వ్యయాలు - కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్‌ రిపోర్టింగ్‌ సర్వే వెల్లడి న్యూఢిల్లీ: సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,536 కోట్లుగా ఉన్నాయి.  2014-15 ఆర్థిక సంవత్సరం సీఎస్‌ఆర్‌ వ్యయాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్‌ రిపోర్టింగ్‌ సర్వే వెల్లడించింది. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.., - 2014-15

Most from this category