STOCKS

News


స్వల్పంగా కోలుకున్న పసిడి

Tuesday 2nd October 2018
Markets_main1538455656.png-20786

గతరాత్రి అమెరికా మార్కెట్లో 6-వారాల కనిష్టానికి పతనమైన పసిడి ధర బుధవారం ఆసియా మార్కెట్లో  కోలుకుంది. డాలర్‌ స్థిరమైన ర్యాలీ అందుకు కారణమవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3.60 డాలర్లు లాభపడి 1,195.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి నెలరోజ గరిష్టాన్ని(95.37) తాకిన డాలర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 94.94 స్థాయిని వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నాఫ్టా(నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ ఎగ్రిమెంట్‌) ఒప్పందం మరోసారి తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా డాలర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీనికి తోడు ఫెడ్‌రిజర్వ్‌ రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్ల పెంపు చూపవచ్చనే అంచనాలతో డాలర్‌ ఇండెక్స్‌ గత రాత్రి నెలరోజుల గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ఆరువారాల కనిష్టస్థాయి 1,188.10 డాలర్లని తాకింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 1,191.70 వద్ద స్థిరపడింది.
లాభాల ముగింపు:-
అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్‌కు సెలవు. గతరాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి పతనం కారణంగా ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి లాభపడింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 10గ్రాముల పసిడి రూ.140.00 పెరుగుదలతో రూ.30621 వద్ద ముగిసింది.



You may be interested

విదేశీ మార్కెట్‌లో 73 దిగువకు రూపాయి

Tuesday 2nd October 2018

73.35 స్థాయికి తగ్గుదల అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం విదేశీ మార్కెట్‌లో నిట్టనిలువునా క్రాష్‌ అయ్యింది. 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనమైంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 10:13 సమయంలో 73.35 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో 73.77 స్థాయికి కూడా పతనమైంది. క్రూడ్‌ ధరలు అమాంతం ఎగయడం, అమెరికా డాలర్‌ బలపడటం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. కాగా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Tuesday 2nd October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 11,053 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 11,061 పాయింట్లతో పోలిస్తే 8 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ రోజంతా ఇదే ట్రెండ్‌లో ఉండి.. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా

Most from this category