STOCKS

News


పసిడి....నెల గరిష్టం నుంచి వెనక్కి

Tuesday 26th March 2019
Markets_main1553579416.png-24796

ప్రపంచమార్కెట్లో పసిడి ధర నెలరోజుల గరిష్టం నుంచి వెనక్కి     వస్తోంది. ఆసియా మార్కెట్లో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్ల నష్టపోయింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,328.35 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా రికవరీ బాట పట్టడంతో పాటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ పెరగడం పసిడి ర్యాలీకి అవరోధాలుగా నిలిచాయి. ఆర్థిక మాంద్య ఆందోళన భయాల నుంచి ప్రపంచఈక్విటీ మార్కెట్లు తేరుకున్నట్లున్నాయి. దీంతో  సోమవారం అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగియగా., ఆసియాలో కొనుగోళ్లదే పైచేయిగా కనిపిస్తోంది. ఫలితంగా 4.15డాలర్లు క్షీణించి 1,324.60డాలర్ల కనిష్టానికి పతనమైంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,330.75 వద్ద నెలరోజుల గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి 1,329.00 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆర్థిక వ్యవస్థ మందగన భయాలు, వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ మెతక ధోరణి ఆందోళన కారణంగా ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3శాతం లాభపడింది. 
దేశీయంగానూ స్వల్ప తగ్గుదల:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.60లు నష్టపోయి రూ.32165.00లు వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.93 వద్ద కొనసాగుతుంది. నిన్న రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.32105లు వద్ద ముగిసింది.



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ నరేష్‌ గోయల్‌కు ఉద్వాసన

Tuesday 26th March 2019

కంపెనీ బోర్డు నుంచి తప్పుకోనున్న గోయల్‌, ఆయన భార్య ఎయిర్‌లైన్స్‌కు తక్షణ సాయం రూ.1,500 కోట్లు బ్యాంకుల పరిష్కార ప్రణాళికకు జెట్‌ బోర్డు ఆమోదం ముంబై: కొన్ని నెలలుగా కొనసాగుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి పరిష్కారం దొరికింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ పదవి నుంచి నరేష్‌ గోయల్‌ తప్పుకోనున్నారు. అంతేకాదు, కంపెనీ

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 26th March 2019

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌:- ఎన్‌సీడీల ద్వారా రూ.600 కోట్లను సమీకరించింది.  టైటాన్‌ కంపెనీ:- కంపెనీ స్వతంత్ర డెరెక్టరుగా ప్రద్యుమ్న రమేష్‌చంద్ర వ్యాస్‌ను నియమించారు.  డీసీఎం:- కంపెనీ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్షియల్‌ పదవికి సుమంత్‌ భరత్‌రామ్‌ రాజీనామా చేశారు. మార్చి 31వ తేది నుంచి రాజీనామా అమల్లోకి రానుంది.  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్:- సంస్థలో తన జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ప్రిడెన్షియల్‌ కార్ప్‌ హోల్డింగ్‌ కంపెనీలో 3.71శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆఫర్‌

Most from this category