STOCKS

News


మరింతగా పెరిగిన పసిడి..!

Friday 7th September 2018
Markets_main1536297894.png-20055

న్యూయార్క్‌/ముంబై:- ఆసియా మార్కెట్లో పసిడి వరుసగా మూడోరోజూ లాభపడింది. యెన్‌ బలపడంతో డాలర్ క్షీణించడం, అమెరికా చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ భయాలు పసిడికి పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆసియా మార్కెట్లో శుక్రవారం భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌ పసిడి 2.60 డాలర్ల పెరిగి రూ.1,206.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వచ్చేవారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జపాన్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడానికి ఆదేశ ప్రతినిధులతో చర్చిస్తారని అమెరికా మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో జపాన్‌ కరెన్సీ యెన్‌ బలపడగా డాలర్‌ క్షీణించింది. ఇప్పటికే చైనాపై 25శాతం సుంకాలను విధించిన ట్రంప్‌ జపాన్‌ ఆటోమొబైల్‌ రంగం మీద కూడా పన్నులు విధించే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సెప్టెంబర్‌ 5న చైనాపై అమెరికా విధించిన 200మిలియన్‌ డాలర్ల దిగుమతి సుంకంపై స్పందించిన చైనా కామర్స్‌ మినిస్టరీ అమెరికా దుందుడుకు చర్యలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.  ఫలితంగా ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. టెక్నాలజీ షేర్ల పతనంతో గతరాత్రి అమెరికా మార్కెట్ల మిశ్రమ ముగింపు నేపథ్యంలో అక్కడ ఔన్స్‌ పసిడి 1,204.3 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా తగ్గుదల:-
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ర్యాలీ చేస్తున్నప్పటికీ.., దేశీయంగా మాత్రం తగ్గుముఖం పడుతోంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10గ్రాముల పసిడి రూ.72.00లు నష్టపోయి రూ.30475.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి బలపడిన నేపథ్యంలో ఈ తగ్గుదల సంభవించింది. గురువారం రాత్రి 10గ్రాముల పసిడి ధర రూ.232లు పెరిగి రూ.30547ల వద్ద ముగిసింది.



You may be interested

అటో షేర్ల ర్యాలీ..!

Friday 7th September 2018

ముంబై:- అటో షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో స్పీడుగా ర్యాలీ చేస్తున్నాయి. అటో షేర్ల ర్యాలీతోనే నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సూచీలు తిరిగి లాభాల బాటపట్టాయి. బజాజ్‌ అటో, టాటా మోటర్స్‌ షేర్ల ర్యాలీ అండతో ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.16శాతం లాభపడింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.06 శాతం లాభంతో 10,913 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ

అరబిందో చేతికి సాండోజ్‌

Friday 7th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అరబిందో చేతికి అమెరికాకు చెందిన సాండోజ్‌ డెర్మటాలజీ చిక్కింది. యూఎస్‌కు చెందిన నోవార్టిస్‌ ఏజీ జనరిక్‌ వ్యాపార విభాగమే ఈ సాండోజ్‌. డీల్‌ విలువ 1 బిలియన్‌ డాలర్‌ (రూ.7,200 కోట్లు). దీనికింకా అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమీషన్‌ అనుమతి ఇవ్వాల్సి ఉందని.. 2019 నాటికి ఈ డీల్‌ మూగిసే అవకాశముందని అరబిందో ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆర్ధిక

Most from this category