STOCKS

News


స్వల్పంగా తగ్గిన పసిడి

Wednesday 20th March 2019
Markets_main1553064233.png-24710

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం సల్పంగా తగ్గుముఖం పె‍ట్టంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల మేర నష్టపోయి 1,303.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ రివకరీ, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ పసిడి పతనానికి కారణమైంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1,306.30 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో ఆసియా ఈక్విటీ మార్కెట్లు 6వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. గత ట్రేడింగ్‌లో 2-వారాల కనిష్టానికి పతనమైన డాలర్‌ ఇండెక్స్‌ కోలుకుని రికవరీ బాట పట్టింది. అలాగే చైనా-అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సైతం తగ్గుముఖం పట్టడం పసిడి ఫ్యూచర్లపై అ‍మ్మకాల ఒత్తిడిని కలిగించాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసిన నేపథ్యంలో అక్కడ పసిడి ధర స్వల్పంగా లాభపడి 1,306.50డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ స్వల్ప తగ్గుదల:- 
దేశీయ మార్కెట్లోనూ పసిడి తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల పతనం, దేశీయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ పసిడి ర్యాలీకి అవరోధంగా నిలుస్తున్నాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి రూ.135లు నష్టపోయి రూ.31838.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో 43 పైసలు నష్టపోయిన రూపాయి నేటి ట్రేడింగ్‌లో 11పైసల వరకు బలపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3డాలర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.



You may be interested

ఓపెన్‌ ఆఫర్‌ ఉన్నప్పుడు బైబ్యాక్‌ కుదరదు!

Wednesday 20th March 2019

 మైండ్‌ట్రీ నిర్ణయంపై నిపుణుల అంచనా ఎల్‌అండ్‌టీ నుంచి ముంచుకొస్తున్న టేకోవర్‌ ముప్పును తప్పించుకునేందుకు మైండ్‌ట్రీ ప్రమోటర్లు నానా యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధబారం బోర్డు మీటింగ్‌ జరగనుంది. ఇందులో బైబ్యాక్‌ ఆఫర్‌పై చర్చిస్తారని గతవారం కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ మీటింగ్‌లో బైబ్యాక్‌ గురించిన ప్రకటన రాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెబి నియమావళి ప్రకారం ఒక కంపెనీ షేర్లకు ఓపెన్‌ ఆఫర్‌  నడుస్తున్నప్పుడు బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించకూడదని

భారత్‌లో గోజీరో మోబిలిటీ బైక్‌లు

Wednesday 20th March 2019

వచ్చే వారం వన్‌, మైల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లు  -లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు కూడా  న్యూఢిల్లీ: బ్రిటిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే వారం రెండు ఎలక్ట్రిక్‌ బైక్‌లు... వన్‌, మైల్‌లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గోజీరో వన్‌ బైక్‌లో 400 వాట్‌అవర్‌(డబ్ల్యూహెచ్‌) లిథియమ్‌ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్‌ కుమార్‌ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే, 60 కీమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గోజీరో

Most from this category