News


పసిడి...ప్రపంచ మార్కెట్లో తగ్గుదల-దేశీయంగా పెరుగుదల

Wednesday 9th January 2019
Markets_main1547012422.png-23476

గతవారం 1300 డాలర్లను తాకిన పసిడి ధర ఈ వారంలో వెనకడుగు వేస్తోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1282 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చనే అంచనాలతో ఈ వారంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల పట్టాయి. అమెరికా మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగియగా, ఆసియా మార్కెట్లు నేడు మూడున్నర వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ముడిచమురు ధరలు సైతం వరుసగా 9వ రోజూ పుంజుకున్నాయి. ఇక సాంకేతికంగా చూసినట్లైతే 1300 డాలర్ల వద్ద పసిడి ధరకు ధరకు తీవ్ర నిరోధం ఉంది. ఈ అంశాలన్నీ పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని, నేడు ఫెడ్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య పరిపతి విధాన సమావేశాల వివరాలు (ఫెడ్‌ మినిట్స్‌) వెల్లడి కానున్న నేపథ్యంలో పసిడి ధర తదుపరి కదలికలు ఉంటాయని విశ్లేషకులు పేర్కోంటున్నారు. అయితే, అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లపై ఛైర్మన్‌ పావెల్‌ మెతక వైఖరి నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడుతున్నప్పటికీ.., పసిడి ధర దిగివస్తుండం గమనార్హం.
దేశీయంగా రూపాయి క్షీణత అండ:-
దేశీయంగా రూపాయి పతనం పసిడి ధరకు కలిసోస్తుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ పెరుగుదలతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనంతో పాటు బాండ్‌ ఈల్డ్‌ సైతం గణనీయంగా క్షీణిస్తుంది. ఫలితంగా ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌(సోమ, మంగళ)లోనే రూ.300లు లాభపడింది. బుధవారం ఉదయం గం.11:00ని.లకు 10గ్రాముల పసిడి ధర రూ.17లు లాభపడి రూ.31,758.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఐఎంఎఫ్ బాధ్యతలు స్వీకరించిన గీతా గోపీనాథ్‌

Wednesday 9th January 2019

చీఫ్‌ ఎకనమిస్ట్‌గా నియమితులైన తొలి మహిళ వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ (47) బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం విశేషం. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేసిన ఐఎ౾౾ంఎఫ్ రీసెర్చ్ విభాగం

భారత ఈక్విటీలపై ఎఫ్‌పీఐలకు తగ్గుతున్న మోజు

Wednesday 9th January 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) భాగస్వామ్యం తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్‌లో దేశీయ ఈక్విటీల్లోకి  విదేశీ నిధుల ప్రవాహం(మొత్తం మార్కెట్‌ క్యాప్‌తో పోలిస్తే) ఒక శాతం దిగువకు పడిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇదే విదేశీ నిధుల ప్రవాహం మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో 3 శాతం ఉండేది. దీంతో పాటు మార్కెట్‌ మొత్తం వాల్యూంల్లో ఎఫ్‌పీఐల ట్రేడింగ్‌ వాల్యూంలు డిసెంబర్‌లో 30 శాతానికి పడిపోయాయి. మూడేళ్ల క్రితం

Most from this category