STOCKS

News


వన్నె తగ్గిన పసిడి

Monday 17th December 2018
Markets_main1545034941.png-22995

డాలర్‌ ర్యాలీతో ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి వన్నె తగ్గింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1241.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచఆర్థిక వృద్ధి నెమ్మదించటం, ఈ వారంలో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో వడ్డీరేట్ల పెంపు ప్రకటనపై మార్కెట్‌ వర్గాల ఆశావహన ధోరణి డాలర్‌కు బలానిస్తున్నాయి. డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి శుక్రవారం పతనస్థాయి నుంచి ఇంకా కోలుకోలేదు. ఇటీవల విడుదలైన చైనా, యూరప్‌ బలహీన ఆర్థిక గణాంకాలు నమోదు మందగించిన ప్రపంచ ఆర్థిక వృద్ధిని సూచిస్తాయి. కనుకు ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపునకు మొగ్గుచూపవచ్చు. గతవారం ట్రేడింగ్‌ చివరిరోజు డాలర్‌ ఇండెక్స్‌కు 19నెలల గరిష్టస్థాయి 97.71ని తాకింది. ఒకవేళ పసిడి ధర పతనం కొనసాగుతూ 1232 డాలర్ల స్థాయి కోల్పోతే 1224-1228 డాలర్ల స్థాయిలో బలమైన నిరోధస్థాయి ఉంది. ఒకవేళ వడ్డీరేట్లను పెంచకపోతే డాలర్‌పై ఒత్తిడిన పెరిగి పసిడి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగా అదే ధోరణి:-
డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో దేశీయ మార్కెట్లోనూ పసిడి నష్టాల బాట పట్టింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.107.00లు నష్టపోయి రూ.31,446ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం పసిడి ధర రూ.31553ల వద్ద ముగిసింది.



You may be interested

అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి కదలికలే కీలకం..!

Monday 17th December 2018

న్యూఢిల్లీ: అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్‌ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్‌ ముందుగానే డిస్కౌంట్‌ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్

ప్రభుత్వ సంస్కరణలతో ఆశించిన ఫలితాలు: ఉపరాష్ట్రపతి

Monday 17th December 2018

న్యూఢిల్లీ: జీఎస్టీ, నల్లధనంపై చట్టం, దివాలా కోడ్‌ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా క్షీణత చవిచూస్తేంటే భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్‌ వైపు వస్తే పన్ను రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు నోట్ల రద్దును సమర్థిస్తూ... దీని ఉద్దేశ్యం నెరవేరిందన్నారు. తలగడల కింద, స్నానాల గదుల్లో దాగి ఉన్న నోట్ల

Most from this category