STOCKS

News


గ్లోబల్‌ లిక్విడిటీ కీలకం!

Friday 15th March 2019
Markets_main1552638518.png-24627

మార్కెట్‌ పరుగులకు ఇంధనం
కోటక్‌ ఎంఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ కృష్ణన్‌
ఎన్నికల ఫలితాల కన్నా అంతర్జాతీయ లిక్విడిటీ పరిస్థితులే మార్కెట్లకు కీలకాంశమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ కృష్ణన్‌ చెప్పారు. ప్రస్తుతం అంతా ఎన్నికల ఫలితాలు, ఎర్నింగ్స్‌ సీజన్‌ప ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, కానీ నిజానికి వీటి కన్నా లిక్విడిటీ సరళంగా ఉండడమే కీలకమని చెప్పారు. లిక్విడిటీ ప్రవాహానికి అవరోధాలు లేకుండా ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ముఖ్యమన్నారు. నిఫ్టీలో చిన్న, మిడ్‌క్యాప్‌ స్టాకులు గణనీయమైన కరెక‌్షన్‌ చూశాయని, ప్రస్తుతం ఇవి బాటమ్‌అవుట్‌ వద్ద ఉన్నాయని తెలిపారు. వీటిలో నాణ్యమైన స్టాకుల్లో ప్రస్తుతం ఎంటర్‌కావచ్చని సూచించారు. లార్జ్‌క్యాప్‌ లేదా మిడ్‌క్యాప్‌ అనిలేకుండా వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండి, ఎకనమిక్‌ సైకిల్‌కు అనుగుణంగా ఉండే కంపెనీలను, రంగాలను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. మార్కెట్లో ఆటుపోట్లు దీర్ఘకాల ఇన్వెస్టర్‌కు వరంలాంటివని, ఇలాంటివి వచ్చినప్పుడే నాణ్యమైన స్టాకులు మంచి ధరల వద్ద లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం చాలామంది పోర్టుఫోలియో నిర్మాణం చేస్తున్నారని, ఎవరైనా దీర్ఘకాలిక వ్యూహంతోటే మార్కెట్లో ప్రవేశించాలని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా మంచి క్యాపెక్స్‌ ప్రణాళికలు, నాణ్యమైన వృద్ధి ఉన్న కంపెనీలను ఎంచుకోవాలని తెలిపారు. 

 



You may be interested

ఫైనాన్షియల్‌, నిర్మాణ రంగ మిడ్‌క్యాప్స్‌ మేలు!

Friday 15th March 2019

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ మిడ్‌క్యాప్‌ రంగంలో ఫైనాన్స్‌, నిర్మాణ రంగాల్లోని కంపెనీల్లో విలువైనవి దొరుకుతాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి నిశ్చల్‌ మహేశ్వరి చెప్పారు. ఫైనాన్షియల్స్‌లో ఎంఎఫ్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు మంచి పురోగతి చూపుతున్నాయన్నారు. బ్యాంకింగ్‌ రంగానికి నిఫ్టీలో అధిక వెయిటేజ్‌ ఉన్నందున నిఫ్టీ ప్రదర్శన మెరుగయ్యేకొద్దీ ఫైనాన్షియల్‌ రంగ ప్రదర్శన కూడా మరింత మెరుగుపడుతుందన్నారు. అందువల్ల ఈ రంగ స్టాకులను ప్రస్తుతానికి విక్రయించవద్దని సూచించారు. కావాలంటే బ్యాంకు షేర్లలోనే ఒకదాని నుంచి మరోదానికి మారుతూఉండొచ్చన్నారు.

రూపాయి ర్యాలీ: ఐనా ఐటీ షేర్లకు గిరాకీ..!

Friday 15th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి భారీ బలపడినప్పటికీ, ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్లో దాదాపు 1.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా 2శాతం లాభపడింది. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టాటా ఎలాక్సీ షేర్లు 1.50శాతం పెరిగాయి. అలాగే ఎన్‌ఐఐటీ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సైతం 1శాతం పెరిగాయి. అలాగే ఇన్ఫీభీమ్‌ షేరు అరశాతం ర్యాలీ చేసింది.

Most from this category