ఆనంద్‌రాఠీ నుంచి మూడు సిఫార్సులు
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ డిసెంబర్ నాటి కనిష్ట స్థాయిల నుంచి బలంగా బౌన్స్‌బ్యాక్ అయ్యిందని ఆనంద్‌రాఠి ఈక్విటీ అడ్వైజరీ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సెదానీ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా వంటి ఆందోళనలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. కొత్త గవర్నర్ నియామకం వల్ల ఆర్బీఐ పాలసీ విధానంలో మార్పు ఉండొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని తెలిపారు. ఆర్బీఐ పాలసీ విధానం న్యూటల్ర్ నుంచి అకామోడేటివ్ వైపు మళ్లొచ్చని వీరు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే క్రూడ్ ధరల తగ్గుదల, అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వంటి అంశాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు పాజిటివ్ అంశాలని తెలిపారు. దేశీయంగా చూస్తే రిటైల్ ద్రవ్యోల్బణం 16 నెలల కనిష్ట స్థాయికి దిగిరావడం, ఐఐపీ దాదాపు ఏడాది గరిష్ట స్థాయికి పెరగడం మరింత సానుకూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు. అయితే ప్రపంచపు రెండో అతిపెద్ద ఆర్థిఖ వ్యవస్థను కలిగిన చైనాలో రిటైల్ అమ్మకాల వృద్ధి 15 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉండటం, పారిశ్రామికోత్పత్తి మూడు నెలల కనిష్ట స్థాయిలో నమోదు కావడం వంటివి ఆందోళనకరమైన అంశాలని తెలిపారు. మరోవైపు యూరోజోన్ వ్యాపార వృద్ధి డిసెంబర్లో నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొన్నారు. ఇవ్వన్నీ గ్లోబల్ ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా వేశారు. ఆయన మంచి రాబడిని అందించగల మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. పెడిలైట్ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ అడెసివ్స్ అండ్ సీలాంట్స్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. వాటర్ప్రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్ బిజినెస్‌లోనూ అధిక మార్కెట్ వాటా లక్ష్యంతో ముందుకెళ్తోంది. భారత్‌లో వాటర్ప్రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్ మార్కెట్ 2025 కల్లా రూ.5,000 కోట్లకు చేరొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుతం దీని మార్కెట్ పరిమాణం రూ.2,000 కోట్లకు దిగువునే ఉంది. క్రూడ్ ధరల్లో ఒడిదుడుకులు, నిర్మాణ రంగంలో వృద్ధి మందగించడం వంటి అంశాల కారణంగా ప్రస్తుత క్యూ2లో కంపెనీ మార్జిన్లు తగ్గాయి. అయితే పెడిలైట్ ఇండస్ట్రీస్ కన్సాలిడేటెడ్ ఆదాయం 14.9 శాతం వృద్ధితో రూ.1,757 కోట్లకు ఎగసింది. అందువల్ల ఈ స్టాక్‌ను రూ.1,345 టార్గెట్ ప్రైస్‌తో కొనుగోలు చేయవచ్చు. ఆర్తి ఇండస్ట్రీస్: 2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం, లాభం చక్రగతిన వరుసగా 20 శాతం, 22 శాతం వృద్ధి చెందొచ్చని అంచనాలున్నాయి. స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ విభాగాల్లో వృద్ధి ఇందుకు దోహదపడొచ్చు. సామర్థ్యం పెంపు మరొక సానుకూల అంశం. ప్రస్తుత క్యూ2లో కంపెనీ ఆదాయం ఏకంగా 46 శాతం వృద్ధితో రూ.1,290 కోట్లకు ఎగసింది. బలమైన విక్రయాలు ఇందుకు దోహదపడ్డాయి. మంచి పనితీరు కనబర్చడం, అధిక సామర్థ్యం వినియోగం కారణంగా ఈబీటా మార్జిన్లు పెరిగాయి. మంచి నిర్వహణ పనితీరు వల్ల పీఏటీ 56 శాతంమేర ఎగసింది. ఆర్అండ్డీపై దృష్టి కేంద్రీకరించడం, క్లయింట్స్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం వంటివి సానుకూల అంశాలు. రూ.1,600 టార్గెట్ ప్రైస్‌తో ఆర్తి ఇండస్ట్రీస్ షేరును కొనుగోలు చేయవచ్చు. ఇంద్రప్రస్థ గ్యాస్: ఈ కంపెనీ గెయిల్ ఇండియా నుంచి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌ను సంపాదించింది. గెయిల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ జాయింట్ వెంచరే ఇంద్రప్రస్థ గ్యాస్. ఇందులో రెండింటికీ 22.5 శాతం చొప్పున వాటాలున్నాయి. కంపెనీ ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో రిటైల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అందించడం, దేశీ ఇండస్ట్రీయల్ కన్సూమర్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్‌ను సరఫరా చేయడం వంటి సేవలందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కంపెనీకి ప్రయోజనకరంగా ఉన్నాయి. రానున్న కాలంలో కంపెనీ మంచి వృద్ధిని సాధించొచ్చనే అంచనాలున్నాయి. రూ.319 టార్గెట్ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.
You may be interested
ఎన్బీఎఫ్సీ షేర్లకు బాండ్ల బైబ్యాక్ జోష్
Thursday 20th December 2018ద్రవ్యలోటుతో ఇటీవల నష్టాల బాట పట్టిన నాన్బ్యాంకింగ్ఫైనాన్స్కంపెనీ(ఎన్బీఎఫ్సీ) షేర్లకు ఆర్బీఐ బాండ్ల బైబ్యాక్ ఇష్యూ జోషనిచ్చింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వ కొరతను రూపుమాపేందుకు బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయాడానికి ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా బాండ్ల కొనుగోలు ద్వారా ఈ డిసెంబర్లో రూ.50వేల కోట్లను, వచ్చే జనవరిలో రూ.50 కోట్లను వ్యవస్థలోకి పంపిణీ చేస్తామని తెలిపింది. ఆర్బీఐ చేపట్టిన ఈ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ
కళ తప్పిన మెటల్ షేర్లు
Thursday 20th December 2018టాప్ లూజర్లుగా హిందాల్కో, వేదాంత అంతర్జాతీయంగా మెటల్ ధరల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లో మెటల్ షేర్లు కళ తప్పాయి. ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నేటి ఇంట్రాడేలో 1.50శాతం నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు తరువాత డాలర్ మారకంలో కాపర్‌తో సహా వివిధ మెటల్ ధరలు నష్టాల బాట పట్టాయి. వడ్డీరేట్ల పెంపుతో వినియోగ శక్తి తగ్గి వ్యవస్థలో ఆర్థిక మందగమనం