News


బోర్డర్‌ టెన్షన్‌ : భారీ నష్టాలతో ప్రారంభం

Tuesday 26th February 2019
Markets_main1551153571.png-24328

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రికత్త వాతవరణం నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ మంగవారం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 35 వేల దిగువున 35,975.75 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 10800 దిగువున 10,775 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి చొచ్చుకుపోయిందని వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌లోకి జొరంబడేందుకు ప్రయత్నించిన భారత్‌ ఎయిర్‌క్రాఫ్‌లను తాము సమర్థవంతగా నిలువరించినట్లు పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి, మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ ట్వీట్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణ అనుమానాలను బలపరుస్తుంది. మరోవైపు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌, అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల తదితర ప్రతికూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఉదయం గం.9:30లకు  సెన్సెక్స్‌ 298 పాయింట్ల నష్టంతో 35,915 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 10,794 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు నెలకొన్నా‍యి. ఎక్కువగా బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు మాత్రమే సల్పంగా నష్టపోయాయి. 
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌, హీరోమోటోకార్ప్‌ షేర్లు 2శాతం నుంచి 2.50నష్టపోగా, కోల్‌ ఇండియా, భారతీఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, ఇన్ఫ్రాటెల్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.You may be interested

ఇక అదానీ ఎయిర్‌పోర్ట్‌లు

Tuesday 26th February 2019

50 ఏళ్ల పాటు నిర్వహణకు ఒప్పందం అత్యధికంగా కోట్ చేసిన అదానీ గ్రూప్ న్యూఢిల్లీ: ప్రైవేట్ దిగ్గజం అదానీ గ్రూప్ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్స్‌లో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. అహ్మదాబాద్‌, తిరువనంతపురం, లక్నో,

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 26th February 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఎమ్‌కో:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా సంజ‌య్ భ‌గ‌త్‌న‌గ‌ర్ రాజీనామా చేశారు.  లుపిన్‌:- కీళ్ల నొప్పుల నివార‌ణ చికిత్సలో వినియోగించే ప్రేడ్నిసోలోన్ ఔష‌ధ విక్రయాల‌న‌కు యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకుంది.  మాస్తెక్‌:-  కంపెనీ షేర్ల‌ను ఐడీఎఫ్‌సీ ఏఎంసీ లిమిటెడ్ కొనుగోలు చేసింది.  వాటా కొనుగోలుతో కంపెనీలో మొత్తం వాటా 5.02శాతానికి చేరుకుంది.  హెచ్ఐఎల్‌:- రూ.276 కోట్ల విలువైన రుణ‌సదుపాయానికి ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ సంస్థ ఎఎ- రేటింగ్‌ను

Most from this category