STOCKS

News


గ్యాస్‌ పంపిణీ కంపెనీలకు బంగారు భవిష్యత్తు!

Friday 12th October 2018
Markets_main1539368435.png-21097

మార్కెట్లు పడుతుంటే... కంపెనీ ఎంత గొప్పదన్న అంశాన్ని ఇన్వెస్టర్లు చూడరు. అమ్మడమే ఎక్కువ మంది చేసే పని. అందుకే బుల్‌ మార్కెట్‌తో పోలిస్తే బేర్‌ మార్కెట్లో మంచి పెట్టుబడి అవకాశాలు అందివస్తాయంటారు. ఆ విధంగా చూస్తే వ్యాపార పరంగా మంచి భవిష్యత్తు ఉన్న సహజవాయువు పంపిణీ కంపెనీలు ఇంద్రప్రస్థ గ్యాస్‌, మహానగర్‌ గ్యాస్‌ పెట్టుబడికి ఆకర్షణీయమైన ధరలకు దిగొచ్చాయి. మహానగర్‌ గ్యాస్‌ 43 శాతం, ఇంద్రప్రస్థ గ్యాస్‌ 35 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. కనుక వీటిపై ఇన్వెస్టర్లు ఓ కన్నేయవచ్చని సూచిస్తున్నారు అనలిస్టులు.

 

మహానగర్‌ గ్యాస్‌
ఇది ప్రభుత్వరంగంలోని గెయిల్‌ ఇండియా, బ్రిటన్‌కు చెందిన బీజీ గ్రూపు జాయింట్‌ వెంచర్‌ కంపెనీ. ముంబై నగరంలో గ్యాస్‌ సరఫరా హక్కులు కలిగిన ఏకైక సంస్థ. గ్రేటర్‌ ముంబై, సమీప ప్రాంతాల్లో గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసే హక్కులు ఈ కంపెనీకే ఉన్నాయి. చెన్నై, విశాఖ నగరాలకు కూడా బిడ్లు వేసింది.

ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌
ఇది గెయిల్‌, బీపీసీఎల్‌ సంయుక్త సంస్థ. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో హక్కులు కలిగి ఉన్నది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ తదితర 11 చోట్ల గ్యాస్‌ పంపిణీ హక్కుల కోసం బిడ్లు వేసింది. 

 

ఈ రెండు కంపెనీలు కొత్త ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో విక్రయాలు గణనీయంగా పెరగనున్నాయి. దేశీయంగా వీటి స్థానం మరింత బలోపేతం కానుంది. ఇటీవలి సహజవాయువు ధరలను పెంచడంతో వీటి మార్జిన్లు పెరగనున్నాయి. అంతేకాదు ధరల భారం పెరిగితే వాటిని వినియోగదారులకు బదిలీ చేయగల సామర్థ్యం వీటికి ఉంది. బలమైన ఆర్థిక మూలాలు, ఆరోగ్యకరమైన బ్యాలన్స్‌ షీటు, రుణ రహితంగా ఉండడం అన్నవి భవిష్యత్తులో మరింత విస్తరణకు అవకాశం కల్పించేవి. ఈ రెండు నగదు నిల్వలు దండిగా ఉన్నవే. ప్రస్తుత అస్థిర మార్కెట్లలో వీటిని పెట్టుబడికి పరిశీలించొచ్చన్నది విశ్లేషకుల సూచన. ఎంజీఎల్‌ 2019 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం 15 పీఈ వద్ద ట్రేడవుతోంది. ఐజీఎల్‌ 19.9 పీఈ వద్ద కోట్‌ అవుతోంది. You may be interested

అవే తప్పులు మళ్లీ మళ్లీ... అందుకే నష్టాలు...? 

Friday 12th October 2018

దీర్ఘకాలం కోసమని భారీగా పెట్టుబడి పెట్టిన వారు తాజా పతనంలో తమ పోర్ట్‌ఫోలియో విలువ చూసుకుని కంగారుపడిపోయే పరిస్థితి నెలకొంది. తాజా పతనంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంపద భారీగా(రూ.17 లక్షల కోట్లకు పైగా) కోతకు గురైంది.  మార్కెట్‌ ఓ పెద్ద టీచర్‌. ఏ తప్పులు చేయరాదో చెబుతూనే ఉంటుంది. కానీ, ఇన్వెస్టర్లుగా మనం వాటిని పట్టించుకోం... పట్టించుకున్నా... మార్కెట్‌ మాయలో గుర్తుంచుకోం.     ‘‘తాజా పతనం నుంచి నేర్చుకున్న అతిపెద్ద పాఠం... రోమ్‌

నిండా ముంచేసిన ఐపీవోలు

Friday 12th October 2018

సెకండరీ మార్కెట్‌లో నష్టాలు ఇన్వెస్టర్లకు సుపరిచితమే. కానీ, ఇటీవలి కాలంలో ప్రైమరీ మార్కెట్‌లో భాగమైన ఐపీవోలు కూడా ఇన్వెస్టర్లను లబోదిబోమనేలా చేస్తున్నాయి. నష్టాలతో నిండా ముంచేస్తున్నాయి. 2017 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల్లో రూ.1,000 కోట్లకు పైగా ఇష్యూ సైజు కలిగిన వాటిని పరిశీలిస్తే... అధిక శాతం లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రూ.1,000 కోట్లకు పైగా ఇష్యూ సైజుతో ఐపీవోకు వచ్చి మార్కెట్లో లిస్ట్‌

Most from this category