STOCKS

News


ఈ నెల 24 నుంచి గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓ

Thursday 13th September 2018
Markets_main1536815019.png-20232

న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఈ నెల 24న మొదలై 26న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.340 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు ధరల శ్రేణిగా రూ.115-118ను కంపెనీ నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై రూ.5 డిస్కౌంట్‌ లభిస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీలో 25 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ బ్యాంక్‌, యస్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తాయి. అక్టోబర్‌ మొదటి వారంలో ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వస్తున్న మూడో ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. 


 



You may be interested

బాష్‌ నుంచి నూతన శ్రేణి వాషింగ్‌ మిషన్లు

Thursday 13th September 2018

హైదరాబాద్‌: గృహోపకరణాల తయారీ సంస్థ బాష్‌ విపణిలోకి కొత్తగా టాప్‌లోడ్‌ వాషింగ్‌ మిషన్లను విడుదల చేసింది. దీంతో పాటూ బాష్‌ ఇతర ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కంపెనీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 14 వరకూ గృహోపకరణాల ఉత్పత్తుల ట్రక్‌ హైదరాబాద్‌లోని అత్తాపూర్, చైతన్యపురి, మదీనాగూడ వంటి పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని.. ఆయా ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బాష్‌

పోటీ సంస్థలపై ఫోన్‌పే విమర్శల దాడి

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన చెల్లింపుల సంస్థ ఫోన్‌పే... ప్రత్యర్థి కంపెనీలపై విమర్శలకు దిగింది. డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌ను భారత పన్ను చట్టం కిందకు తీసుకువచ్చే ఆర్‌బీఐ డేటా లోకలైజేషన్‌ను అవి వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించింది. డేటాను తప్పనిసరిగా స్థానికంగానే స్టోర్‌ చేయాలన్న ఆర్‌బీఐ నిబంధన వల్ల... యూజర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని సెర్చ్‌, మ్యాప్స్‌, షోషల్‌ మీడియా సేవలను ఆఫర్‌చేసే గూగుల్‌, ఫేస్‌బుక్‌ నుంచి భారత యూజర్ల పేమెంట్‌ డేటాకు రక్షణ

Most from this category