STOCKS

News


మెప్పించని గార్డెన్‌ రీచ్‌ లిస్టింగ్‌

Wednesday 10th October 2018
Markets_main1539155202.png-21013

12శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్‌
ముంబై:- ఇటీవల ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకున్న గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ లిస్టింగ్‌లో మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్‌ఈలో 12శాతం(రూ.16లు) డిస్కౌంట్‌తో రూ.104.00ల వద్ద లిస్టైంది. ఇష్యూలో ఐపీఓకు అంతం స్పందన రావడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపలేదు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 19శాతం నష్టపోయి రూ.95.35ల స్థాయికి చేరుకుంది. ఉదయం గం.11:45ని.లకు షేరు బీఎస్‌ఈలో 15శాతం నష్టంతో రూ.99.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూ.340 కోట్ల లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిన ఈ పబ్లిక్‌ ఇష్యూ ఈ సెప్టెంబర్‌ నెల 24న ప్రారంభమైంది.  తొలుత ఇష్యూకి తగిన స్పందన లభించకపోవడంతో ప్రభుత్వం గడువును మూడు రోజులపాటు పొడిగించడంతో పాటు ధర శ్రేణిని కూడా సవరించింది. తొలుత రూ. 115-118ల మధ్య నిర్ణయించిన ధరల శ్రేణిని ప్రభుత్వం రూ.114-118లుగా సవరించింది. ఫలితంగా  సెప్టెంబర్‌ 26న ముగియాల్సిన ఇష్యూ  అక్టోబర్‌ 1 వరకూ కొనసాగింది. ఇష్యూ 1.02 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 2.92 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. 2.97 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. క్విబ్‌ భాగంలో 1.81 రెట్లు బిడ్స్‌ లభించాయి.



You may be interested

ఈ పతనం ఆగనిది..

Wednesday 10th October 2018

రూపీ క్షీణత వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది రాయిటర్స్‌ నివేదిక భారత కరెన్సీ మరికొంత కాలం తాజా కనిష్ఠాలకు అటుఇటుగానే కదలాడవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సైతం రూపాయి ఇదే స్థాయిలకు అటుఇటుగా ఉండొచ్చని, ఎలాంటి భారీ రికవరీ ఆశించలేమని అంచనా వేశారు. డిసెంబర్‌లో, వచ్చే ఏడాది రేట్లు పెంచుతామని ఆర్‌బీఐ తన తాజా సమీక్షా సమావేశం అనంతరం వెల్లడించింది. ఆర్‌బీఐ రేట్లు పెంచినా ఎలాంటి ఫలితం ఉండదని,

10400 పాయింట్లకు అటు ఇటుగా నిరోధం?!

Wednesday 10th October 2018

నిఫ్టీపై గిన్నిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా దేశీయ మార్కెట్లు బుధవారం రిలీఫ్‌ ర్యాలీ చూపుతున్నాయి. మంగళవారం పాజిటివ్‌ జోరును కొనసాగించలేక సూచీలు నెగిటివ్‌గా క్లోజయ్యాయి. బుధవారం ఆరంభం నుంచే సూచీలు లాభాల్లో కొనసాగడం ఆరంభించాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి 10400 పాయింట్ల వద్ద  తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. ఒక వేళ ఈ స్థాయిని దాటితే 10550 పాయింట్ల వద్ద మరో గట్టి నిరోధం ఎదురుకానుంది. ఈ స్థాయిని కూడా దాటి బలంగా క్లోజయితే

Most from this category