News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 27th December 2018
Markets_main1545882872.png-23247

సెన్సెక్స్‌ 36,000పైన, నిఫ్టీ 10,800 పైన

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో గురువారం భారత్‌ మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 350 పాయింట్ల పెరుగుదలతో 36,041 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ88 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,818 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 5 శాతం ర్యాలీ జరిపిన ప్రభావంతో ఆసియా సూచీలు సైతం పాజిటివ్‌గా ట్రేడవుతున్న ప్రభావం ఇక్కడి మార్కెట్‌పై పడింది. మెటల్‌ షేర్లు వేదాంత, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లతో పాటు సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం పెరిగాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లు స్వల్పంగా క్షీణించాయి.

అమెరికా, జపాన్‌లు భారీ ర్యాలీ

కొద్దిరోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన ధనిక మార్కెట్లయిన అమెరికా, జపాన్‌ సూచీలు పటిష్టంగా రిబౌండ్‌ అయ్యాయి. దశాబ్దకాలంలో ఎన్నడూ పెరగనంత అధికంగా అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 1000 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 22,850 పాయింట్ల సమీపంలో ముగియగా, టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 350 పాయింట్లపైగా ర్యాలీ జరిపింది. ఈ ప్రభావంతో గురువారం పటిష్టంగా ప్రారంభమైన జపాన్‌ సూచీ 770 (4 శాతం) జంప్‌చేసింది. ఈ రెండు దేశాల సూచీలు వాటి గరిష్టస్థాయిల నుంచి ఇటీవల 20 శాతం పతనాన్ని చవిచూసాయి. అమెరికా, జపాన్‌ మార్కెట్ల ప్రభావంతో ఇతర ప్రధాన అసియా సూచీలైన హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు 1-2 శాతం మధ్య పెరిగాయి. You may be interested

సమ్మెతో స్తంభించిన బ్యాంకింగ్‌

Thursday 27th December 2018

- డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్‌పై ప్రభావం - 3 రాష్ట్రాల్లో నిల్చిపోయిన రూ.2 లక్షల కోట్ల చెక్కుల లావాదేవీలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులతో పాటు కొన్ని విదేశీ బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో

గురువారం ప్రభావిత షేర్లు

Thursday 27th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా:- పేటెంట్‌ ఉల్లంఘన కేసులో తన అనుబంధ సంస్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీకి కోర్టు నుంచి ఊరట లభించింది. ఎన్‌టీపీసీ:- బిల్హాపూర్‌ సోలార్‌ పీవీ ప్రాజెక్ట్స్‌, ఆరియా  సోలార్‌ ప్లాంట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌:- కేర్‌ రేటింగ్‌ సం‍స్థ ఇటీవల జారీ రూ.715 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ(+) రేటింగ్‌ను కేటాయించింది. విస్తా ఫార్మాస్యూటికల్స్‌:- కంపెనీ

Most from this category