STOCKS

News


నిఫ్టీ 50 పాయింట్లు గ్యాప్‌అప్‌

Thursday 1st November 2018
Markets_main1541044400.png-21622

ప్రపంచ మార్కెట్ల సానుకూల ప్రభావంతో బుధవారంనాటి భారీ ర్యాలీకి కొనసాగింపుగా గురువారం గ్యాప్‌అప్‌తో భారత్‌ సూచీలు ప్రారంభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 206 పాయింట్ల పెరుగుదలతో 34,650 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల తగ్గుదలతో 10,442 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన ఇంజనీరింగ్‌ కంపెనీ లార్సన్‌ అండ్‌ టూబ్రో 4 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 1,350 వద్ద ప్రారంభమై నిఫ్టీ టాప్‌గెయినర్లలో ఒకటిగా నిలిచింది. పెట్రో రిఫైనరీలు హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లు 2 శాతం మేర పెరిగాయి. హిందాల్కో, మహింద్రాలు 1 శాతం వరకూ పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. టెక్‌ షేర్లు టీసీఎస్, విప్రో, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 1 శాతంపైగా క్షీణతతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 


 ప్రపంచ మార్కెట్ల ర్యాలీ..

టెక్నాలజీ షేర్ల అండతో గత రాత్రి అమెరికా సూచీలు పటిష్టంగా 2 శాతం వరకూ ర్యాలీ జరపిన ప్రభావంతో బుధవారం ఆసియాలో జపాన్‌ మినహా మిగిలిన ప్రధాన సూచీలన్నీ జోరుగా పెరిగాయి. ఉదయం 9 గంటల సమయానికి అన్నింటికంటే అధికంగా హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 1.5 శాతం పెరగ్గా,  సింగపూర్‌ స్ట్రయిట్‌టైమ్స్, చైనా షాంఘై, కొరియా కోస్పి,  తైవాన్‌ వెయిటెడ్‌ ఇండెక్స్‌ సూచీలు 0.5–1 శాతం మధ్య పెరిగాయి. గత రెండు రోజులుగా పెద్ద ర్యాలీ జరిపిన జ పాన్‌ నికాయ్‌ సూచి తాజాగా 0.5 శాతం వరకూ క్షీణించింది. క్రితం రోజు రాత్రి అమెరికాలో డోజోన్స్‌ సూచీ 240 పాయింట్ల మేర ర్యాలీ జరిపి 25,100 పాయింట్ల ఎగువన ముగియగా, ఎస్‌ అండ్‌ పీ500 సూచి 29 పాయింట్ల వరకూ పెరిగి 2,712 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌–100 ఇండెక్స్‌ భారీగా 156 పాయింట్లు ఎగిసింది. 
 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 1st November 2018

వివిధ వార్తల్లోని షేర్లకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..! కోల్‌ ఇండియా:- వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి రూ.4300 కోట్ల విలువైన షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించగా రూ.15.84 కోట్ల షేర్లకు స్పందన లభించింది. అంటే 106శాతం ఓవర్‌ సబ్‌స్క్రెబ్‌ అయిందన్న మాట.  ఓఎఫ్‌ఎస్‌ షేర్ల జారీ భాగంగా నేటి (నవంబర్‌ 1న) నుంచి 3.96ఈక్విటీ

అమేజాన్‌-ఐసీఐసీఐ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు

Thursday 1st November 2018

అమేజాన్‌ సైట్లో తరచూ షాపింగ్‌ చేసే వారికి తీపివార్త... ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి అమేజాన్‌ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డుతో షాపింగ్‌ చేయడం ద్వారా అదనపు ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. ఈ కార్డులో ప్రతీ రూ.1,000 కొనుగోలుపై రివార్డు పాయింట్లు లభిస్తాయి. పైగా గరిష్ట పరిమితి అంటూ లేదు. ఇవి ఎక్స్‌పైర్‌ కూడా కావు. ప్రతీ రివార్డ్‌ పాయింటు ఒక రూపాయికి సమానం.    రివార్డు పాయింట్లు అమేజాన్‌ డాట్‌ ఇన్‌లో

Most from this category