STOCKS

News


రిలయన్స్‌ అప్‌....పాజిటివ్‌ ఓపెనింగ్‌

Friday 18th January 2019
Markets_main1547783862.png-23647

అంతర్జాతీయ సానుకూల మార్కెట్లకు తోడు, క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చడంతో శుక్రవారం భారత్‌ సూచీలు పాజటివ్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల పెరుగుదలతో 36,429 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,924 పాయింట్ల వద్ద మొదలయ్యింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.5 శాతం లాభంతో రూ. 1150 వద్ద ప్రారంభమయ్యింది. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సన్‌ఫార్మా ట్రేడింగ్‌ ప్రారంభంలో 9 శాతం పతనమయ్యింది.  యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ స్వల్పంగా తగ్గాయి. 

ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌...

గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు నెలరోజుల గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 180 పాయింట్లు జంప్‌చేసి 22,380 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తాజాగా ఆసియాలోని జపాన్‌ నికాయ్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌లు 1 శాతం పెరుగుదలతో ట్రేడవుతుండగా, సింగపూర్‌, కొరియా, తైవాన్‌ సూచీలు అరశాతంపైగా లాభాలతో కదులుతున్నాయి. 



You may be interested

సన్‌ఫార్మా: 12శాతం క్రాష్‌

Friday 18th January 2019

దేశీయ ఔషధ దిగ్గజం సన్‌ ఫార్మాసూటికల్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  12శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో సన్‌ఫార్మా షేరు రూ.425.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సన్‌ ఫార్మా సంస్థ కో- ప్రమోటర్‌ సుధీర్‌వాలియా ఆధీకృత సంస్థ సురేఖ రియల్టీ 2014-2017 మధ్యకాలంలో ఆదిత్యా మెడిసేల్స్‌తో రూ.5,800 కోట్ల లావాదేవీలు జరిపింది. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి 172 పేజీల సమగ్ర సమాచారంతో

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 18th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు అర‌బిందో ఫార్మా:- అంకాలజీ వ్యాధి నివార‌ణ‌లో వినియోగించే ఏడు ఇంజెక్షన్‌ల‌ను అమెరికాకు చెందిన స్పెక్ట్రమ్ ఫార్మాస్యూటిక‌ల్స్ నుంచి కొనుగోలు చేసింది. మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.2,134 కోట్లు ఉంటుంది. లుపిన్‌:- ఇటీవ‌ల పీతాంబ‌రం యూనిట్లో త‌నిఖీలు పూర్తి యూఎస్ఎఫ్డీఏ అభ్యంత‌ర లెట‌ర్‌ను జారీ చేసిన‌ట్లు మీడియా వార్తలు వెలువ‌డ్డాయి. జెట్ ఎయిర్‌వేస్‌:- రెజుల్యూష‌న్ ప్రణాళిక‌లో భాగంగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో కన్షారియంకు న‌రేష్ గోయ‌ల్

Most from this category