STOCKS

News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 2nd January 2019
Markets_main1546400630.png-23353

సెన్సెక్స్‌ 150 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్లు డౌన్‌

 

ప్రతికూల ఆసియా సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల తగ్గుదలతో 36, 104 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల క్షీణతతో 10,858 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, వేదాంత, హిందాల్కోలు ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 5 శాతం నష్టపోయాయి. అలాగే ఆటోమొబైల్‌ షేర్లు మహింద్రా, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు 1-5 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు టెక్నాలజీ షేర్లు విప్రో, టెక్‌ మహింద్రా, టీసీఎస్‌లు 1 శాతం వరకూ పెరుగుదలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 

ఆసియా డౌన్‌...

న్యూఇయర్‌ హాలిడే సందర్భంగా క్రితం రోజు సెలవులో వున్న ఆసియా మార్కెట్లు బుధవారం భారీ క్షీణతతో ఈ ఏడాది తొలి ట్రేడింగ్‌ రోజును ప్రారంభించాయి. చైనా ఉత్పాదక రంగం బాగా మందగించిందన్న వార్తలతో ఆ దేశపు సూచి షాంఘై 1 శాతంపైగా పడిపోగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి 2.5 శాతం, తైవాన్‌ వెయిటెడ్‌ సూచి 1.2 శాతం చొప్పున పతనమయ్యాయి. దక్షిణ కొరియా, సింగపూర్‌ సూచీలు 1 శాతం క్షీణించాయి. జపాన్‌ మార్కెట్‌కు ఈ రోజు కూడా సెలవు. 



You may be interested

లాభాల్లో పసిడి

Wednesday 2nd January 2019

ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ధరకు కలిసొస్తుంది. ఈ ఏడాదిలో పసిడికి తొలి ట్రేడింగ్ రోజైన బుధవారం ఆసియా ట్రేడింగ్లో ఉదయం సెషన్లో 4డాలర్లు లాభపడింది. అమెరికా ఫ్యూచర్లు నష్టాల ట్రేడింగ్‌ సైతం పసిడి ర్యాలీకి సహకరిస్తుంది. ఉదయం 9:45ని.లకు ఔన్స్ పసిడి ధర 3.55 డాలర్లు లాభపడి 1,284.85 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.  ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంతో చైనా ఉత్పాదక రంగం 2107 మే

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 2nd January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి ఆటోరంగ కంపెనీలు నిన్న డిసెంబ‌ర్ నెల‌కు సంబంధించిన వాహన విక్రయాల గ‌ణాంకాలు ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో నేడు ఆయా కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై గ‌ణాంకాలు ప్రభావాన్ని చూప‌వ‌చ్చు.   ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌:- కంపెనీ ఛైర్మన్‌గా వీకే శ‌ర్మ రాజీనామా చేశారు. గ్లెన్‌మార్క్ ఫార్మా:- తన యాక్టివ్ ఫార్మాస్యూటిక‌ల్ ఇంగ్రిడియెంట్(ఏపీఐ) వ్యాపారాన్ని అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ సైన్సెస్ లిమిటెడ్‌కు విజ‌య‌వంతంగా మార్చింది. చంబ‌ల్ ఫెర్టిలైజ‌ర్స్

Most from this category