STOCKS

News


గ్యాప్‌అప్‌ ప్రారంభం

Wednesday 15th May 2019
Markets_main1557891683.png-25740

 ప్రపంచ ప్రధాన మార్కెట్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌అప్‌తో  ప్రారంభమమయ్యింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 37,540 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,272 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, అదాని పోర్ట్స్‌, యూపీఎల్‌లు 1 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో లాభనపడ్డాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌ 4 శాతం నష్టంతో రూ. 149 స్థాయికి పడిపోయింది. సన్‌ఫార్మా, గ్రాసిమ్‌, హింద్‌ లీవర్‌, అల్రా‍్టటెక్‌లు 1-2 శాతం మధ్య నష్టపోయాయి.

ఆసియా అప్‌....

 తాజాగా ఆసియాలో జపాన్‌ నికాయ్‌ సూచి స్వల్పంగా పెరగ్గా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 0.8 శాతం పెరిగింది.  సింగపూర్‌, తైవాన్‌, చైనా సూచీలు కూడా 1 శాతం వరకూ లాభాలతో కదులుతున్నాయి. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 0.8 శాతం వరకూ పెరిగి ముగిసాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో  కొనసాగడంతో గత కొద్దిరోజులుగా భారీ నష్టాల్ని చవిచూసిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు జరిపిన షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా భారత్‌ సూచీలు సైతం క్రితం రోజు తొమ్మిదిరోజుల నష్టాలకు బ్రేక్‌వేసి, లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ:- గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌ టెండర్‌ దక్కించుకునేందుకు విజయవంతంగా బిడ్‌ పక్రియను పూర్తి చేసింది.  జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ సీఈవో పదవికి వినయ్‌ దుబే రాజీనామా చేశారు. టోరెంటో పవర్‌:- ప్రైవేట్‌ పద్ధతితో రూ.270 కోట్ల విలువైన ఎన్‌సీడీల ఇష్యూను జారీ చేసింది.  ఆర్చిడ్‌ ఫార్మా:- రైస్‌డ్రోనేట్‌ సోడియం ఔషధాల విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. ఫ్యూచర్‌ సప్లై చైన్‌:-

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు అప్‌

Wednesday 15th May 2019

 ప్రపంచ ప్రధాన మార్కెట్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభాలతో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు  22  పాయింట్ల లాభంతో 11,264 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,242 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఆసియాలో జపాన్‌ నికాయ్‌ సూచి స్వల్పంగా తగ్గగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌

Most from this category