STOCKS

News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Friday 16th August 2019
Markets_main1565927669.png-27795

 స్వాతంత్రదినం సెలవు తర్వాత శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో పునర్‌ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా క్షీణతతో 37,100 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్లకుపైగా తగ్గుదలతో 10,960 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. బుధవారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా పతనమైన ప్రభావం ఈ ఉదయం ఇక్కడి ట్రేడింగ్‌పై పడింది. యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, సిప్లా, కోల్‌ ఇండియాలు స్వల్పలాభాలతో మొదలుకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 8 శాతం పడిపోయింది. మెటల్‌ షేర్లు  వేదాంత, టాటా స్టీల్‌, హిందాల్కో 2-4 శాతం మధ్య నష్టపోగా, ఐటీ షేర్లు విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 2 శాతం వరకూ క్షీణించాయి. 



You may be interested

పతనాల తర్వాత పెరిగిన చమురు

Friday 16th August 2019

యుఎస్‌ రిటైల్‌ అమ్మకాలు పెరగడంతో, అమెరికా ఆర్థిక మాంద్య ఆందోళనలు కొంత తగ్గాయి. ఫలితంగా వరుసగా రెండు సెషన్‌లలో నష్టపోయిన చమురు ధరలు శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌ 58.54 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 0.8 శాతం పెరిగి బ్యారెల్‌ 54.90 డాలర్లకు చేరుకుంది. కాగా గత రెండు సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 2.1 శాతం, 3 శాతం నష్టపోగా,

ప్రధాని ప్రకటనలు... ఈ రంగాలపై ప్రభావం!

Friday 16th August 2019

ప్రధాని నరేంద్రమోదీ 73వ స్వాతంత్ర్యదినం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశాభివృద్ధి, ఆర్థిక రంగం, వ్యాపార, పర్యాటకం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం ఇలా ఎన్నో రంగాలను స్పృశించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం ఇందులో కీలకమైనది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నది ప్రధాని ప్రకటన సారాంశం. అలాగే, రసాయన ఎరువుల వినియోగ వాడకాన్ని రైతులు ఆపేయాలని కూడా ప్రధాని కోరారు. విదేశాల్లోని అందాలు చూడడానికి బదులు... దేశంలోనే ఉన్న

Most from this category