STOCKS

News


క్రూడ్‌ ధరలు తగ్గినా.. లాభముండదు..

Wednesday 21st November 2018
Markets_main1542782801.png-22260

క్రూడ్‌ ధరల్లో మరింత పతనం నమోదైనా కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం ఉండకపోవచ్చని వందా ఇన్‌సైట్స్‌ ఫౌండర్‌, సీఈవో వందన హరి తెలిపారు. క్రూడ్‌ ధరలు తగ్గుదల నేపథ్యంలో ఒపెన్‌, నాన్‌-ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చని అంచనా వేశారు. ఆమె ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అస్థిరత ఉందని, ఇది కొనసాగవచ్చని పేర్కొన్నారు. రానున్న కాలంలో పరిస్థితులు మరింత అద్వానంగా మారొచ్చని అంచనా వేశారు. అలాగే క్రూడ్‌ ధరలు మరింత తగ్గొచ్చని తెలిపారు. ఒపెక్‌, నాన్‌-ఒపెక్‌ దేశాలు డిసెంబర్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చని పేర్కొన్నారు. 
ఫెడరల్‌ రిజర్వు డిసెంబర్‌ రేట్ల పెంపు అంచనాలు ఇప్పటికే మార్కెట్లపై ప్రభావం చూపాయని వందన హరి తెలిపారు. ఆయిల్‌ ధరలపై ఫెడ్‌ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మరోవిడత రేట్లు పెంపు ఉంటే, అలాగే 2019లో నాలుగు సార్లు రేట్లు పెరిగితే అప్పుడు క్రూడ్‌ ఆయిల్‌పై విపరీతమైన ఒత్తిడి నెలకొంటుందని తెలిపారు. దీని కన్నా ముందు రేట్లు పెంపు వల్ల పైనాన్షియల్‌ మార్కెట్లు, కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తుందని తెలిపారు. అందువల్ల ఫెడ్‌ రేట్ల పెంపు నిర్ణయం వల్ల క్రూడ్‌ ధరలు మరింత దిగువకు పడిపోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్‌ 6 మధ్య కాలంలో ఏం జరుగుతుందనే అంశాన్ని నిశితంగా గమనించాల్సి ఉందని తెలిపారు. ఈ మధ్యకాలంలో క్రూడ్‌ ధరలు మరింత పడిపోతే అప్పుడు ఒపెక్‌, నాన్‌-ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరాను తగ్గిస్తాయని పేర్కొన్నారు. 
క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో ఇతర కమోడిటీలపై కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంటుందని వందన హరి తెలిపారు. ఓవర్‌ సప్లై వల్ల మాత్రమే కాకుండా ఆర్థిక వృద్ధి మందగమనం, గ్లోబల్‌ ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలు క్రూడ్‌ ధరల తగ్గుదలకు కారణమని వివరించారు. చాలా కమోడిటీల ధరలు కూడా తగ్గొచ్చని తెలిపారు. క్రూడ్‌ ధరల విషయానికి వస్తే ఒపెక్‌.. నాన్‌-ఒపెక్‌ దేశాలు, సరఫరా నియంత్రణ, ఉత్పత్తి తగ్గించడం వంటి పలు అంశాలు ఉంటాయని వీటి ఆధారంగా ధరలను పడిపోకుండా చూసుకోవచ్చని, అయితే ఇతర కమోడిటీల విషయంలో ఇలాంటివి ఉండవని పేర్కొన్నారు. ఒపెక్‌ దేశాల నిర్ణయంపై గ్లోబల్‌ ఆర్థిక వృద్ధి అంచనాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రపంచ వృద్ధి మందగిస్తుందనే అంచనాలు ఉన్నాయని, అయితే 2019లో ఇది ఏ స్థాయిలో ఉంటుందనే అంశం తెలియాల్సి ఉందని, దీనిపై చాలా ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు. 



You may be interested

10,500 వరకు బుల్స్‌దే హవా..!

Wednesday 21st November 2018

ముంబై: గతవారం 10,450-10,650 స్థాయిలో కన్సాలిడేషన్‌ పూర్తిచేసిన నిఫ్టీ ఈ శ్రేణి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. నిఫ్టీ 200-రోజుల సగటు కదలికల స్థాయి (డీఎంఏ) 10,750 పాయింట్ల వద్ద ఉండగా, 50-రోజుల సగటు కదలికల స్థాయి 10,715 వద్ద ఉన్నట్లు మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌ విశ్లేషకులు అర్పన్ షా తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో 10,700 వద్ద కన్సాలిడేషన్‌కు అవకాశం ఉండగా.. 10,750 పాయింట్ల ఎగువన ముగిస్తే మాత్రం 10,820

ఎన్‌హెచ్‌ఏఐ భారీ బాండ్స్‌ ఇష్యూ

Wednesday 21st November 2018

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధమౌతోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ట్యాక్సబుల్‌ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ఈ రకం బాం‍డ్లను జారీ చేయనుండటం ఇదే తొలిసారి. బాండ్ల జారీ ద్వారా సేకరించిన నిధులను భారత్‌మాల ప్రాజెక్టు కోసం వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. వచ్చే రెండు వారాల్లో బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కావొచ్చనే అంచనాలున్నాయి. 3, 5,

Most from this category