News


ఆర్‌బీఐ-కేంద్రం విభేదాలు.. విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళన

Monday 19th November 2018
news_main1542611671.png-22181

ఆర్‌బీఐ-కేంద్రం మధ్య నడుస్తోన్న పలు వివాదాలు విదేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ‍ప్రభావం చూపుతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ స్వే‍చ్ఛను నియంత్రించాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వపు విధానాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. మరీముఖ్యంగా ఇండియన్‌ రూపాయి, బాండ్‌ మార్కెట్‌పై ఒత్తిడి పెగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
ఆర్‌బీఐ స్వతంత్రతను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా.. భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని లండన్‌లోని పిన్‌బ్రిడ్జ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఫండ్‌ మేనేజర్‌ అండర్స్‌ ఫెర్గెమాన్‌ తెలిపారు. ఏ దేశానికైనా బలమైన ఇన్‌స్టిట్యూషన్స్‌ చాలా చాలా అవసరమని, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాలంటే సెం‍ట్రల్‌ బ్యాంకులకు స్వయంప్రతిపత్తి కచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. 
కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం నేడు జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు, ఆర్‌బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలి, లెండింగ్‌ నిబంధనలు అనే అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. 



You may be interested

చార్ట్‌వ్యూఇండియా సిఫార్సులు..

Monday 19th November 2018

చార్ట్‌వ్యూఇండియా తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం..  ఇండియన్‌ హోటల్స్‌: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. సంస్థ దీనికి చివరగా టార్గెట్‌ ప్రైస్‌ను రూ.135గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం టార్గెట్‌ ప్రైస్‌ను రూ.147కు పెంచింది. ఇక రూ.127ను స్టాప్‌ లాస్‌గా నిర్ణయించింది. స్టాక్‌పై 15 శాతం రిటర్న్‌ అంచనా వేస్తోంది.   వొడాఫోన్‌ ఐడియా: ఈ షేరును కొనుగోలు చేయవచ్చని రికమెండ్‌ చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను

టాటా డీల్‌పై డైలమా... ఎయిర్‌వేస్‌ డౌన్‌

Monday 19th November 2018

ముంబై:- కంపెనీలో వాటాను కొనుగోలుకు టాటాసన్స్‌ గ్రూప్‌ ఆసక్తి చూపిన నేపథ్యంలో గతవారం 41శాతం ర్యాలీ చేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు సోమవారం నష్టాల బాటలోకి పట్టింది. వాటా కొనుగోలు అంశంపై చర్చలు జరిపినప్పటికి.., బోర్డు ఇంకా  నిర్మాణాత్మక నిర్ణయాలేవీ తీసుకోలేదని టాటాసన్స్‌ ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ బీఎస్‌ఈలో 6.59శాతం నష్టంతో రూ.324.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరులో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో

Most from this category