STOCKS

News


అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది: మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 19th September 2018
Markets_main1537296998.png-20366

ప్రస్తుత సమస్యలను మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయని, ఫండమెంటల్‌ విలువలు ప్రస్తుత అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని తెలియజేస్తున్నట్టు మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. సెన్సెక్స్‌ 2019 సెప్టెంబర్‌ నాటికి 42,000కు చేరుతుందని, ఇక్కడి నుంచి 11 శాతం అప్‌సైడ్‌కు అవకాశం ఉంటుందని మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. తొలుత 2019 జూన్‌కు 36,000 టార్గెట్‌ ఇవ్వగా, అది ఈ ఏడాది జూలైలోనే సెన్సెక్స్‌ అధిగమించేసింది. దీంతో టార్గెట్‌ను సవరించింది. ఆదాయాల్లో వృద్ధి రికవరీ అన్నది ఆలస్యం కావడం భారత ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా లేకపోవడానికి ముఖ్య కారణంగా దేశాయ్‌ పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకుంటే ఈ ధోరణి మారుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌ కొన్ని నెలల క్రితమే మొదలైన రికవరీ మార్గంలో ఉంది. అందుకే స్టాక్స్‌ పెరుగుతూ పోతున్నాయి’’అని దేశాయ్‌ చెప్పారు. జీడీపీ రేషియో అన్నది చారిత్రక కనిష్ట స్థాయిలో ఉందని, రానున్న 4-6 త్రైమాసికాల్లో కార్పొరేట్ల లాభాల మార్జిన్‌ వేగంగా రికవరీ అవుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 


అధిక చమురు ధరలు, బలహీన రూపాయి, బాండ్‌ ఈల్డ్‌ 8 శాతం పైకి చేరడం, వాణిజ్య యుద్ధం వంటి సమస్యల కారణంగా మార్కెట్లు అస్థిరతలకు లోనవుతున్నట్టు రిధమ్‌ దేశాయ్‌ వివరించారు. ఈ అంశాలను మార్కెట్‌ ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని, భవిష్యత్తువైపు ఆశాజనకంగా చూస్తోందన్నారు. 2008 జనవరిలో, 2009 మార్చిలో, 2013 ఆగస్ట్‌లో మాదిరిగా మార్కెట్లు ప్రస్తుతం భయానకంగా కానీ లేదా అతిశయంగా కానీ లేవన్నారు. అయితే, మార్కెట్‌పై ప్రభావం చూపించే అంశాల విషయంలో వచ్చే కొన్ని నెలల్లో ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘‘కచ్చితంగా రిస్క్‌ ఉంది. అది ప్రపంచ మందగమనం, ఎన్నిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం కావచ్చు. ఫెడ్‌, ఆర్‌బీఐ నుంచి కూడా ఊహించని నిర్ణయం ఉండొచ్చు. కానీ, ఫండమెంటల్‌ విలువలు మాత్రం మన మార్కెట్లు అప్‌ట్రెండ్‌లోనే ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇన్వెస్టర్లు పనితీరులో వెనుకబడి ఉన్న మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుండడం, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకుంటున్నారు’’ అని దేశాయ్‌ వివరించారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది కాకుండా సమర్థవంతమైన నాయకత్వమే ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు కీలకమవుతుందని చెప్పారు. ఎస్‌బీఐ, ప్రెస్టీడ్‌ ఎస్టెట్‌, అపోలో హాస్పిటల్స్‌ తమ పరిశీలన జాబితాలోకి చేర్చినట్టు తెలిపారు.
 You may be interested

ప్రతీ సంక్షోభం సంపద సృష్టికి అవకాశమే!

Wednesday 19th September 2018

మార్కెట్లో సంక్షోభాలు, బుల్‌ ర్యాలీలు క్రమం తప్పకుండా కనిపించే పరిణామాలుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలను నేర్పింది. ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలను మిగిల్చిన సంక్షోభాల్లో ఇదీ ఒకటి. ఆ సమయంలో మార్కెట్లు కుప్పకూలడంతో స్టాక్స్‌ చెల్లాచెదురయ్యాయి. నాటి నష్టాలను తట్టుకోలేక ఉన్నవన్నీ అమ్ముకుని బయటపడిన వారు ఎందరో. నిజానికి నాటి సంక్షోభ సమయంలో భయపడి ఉన్నదంతా అమ్ముకున్న వారు, ఆ తర్వాతి సంవత్సరం

స్వల్పకాలానికి ఈ  షేర్లు చూడొచ్చు

Tuesday 18th September 2018

సమీప భవిష్యత్తులో నిఫ్టీపై ఒత్తిడి కొనసాగుతుందని, 10,200 సమీపంలో మద్దతు పొందవచ్చని, 10,523 పాయింట్ల వద్ద పటిష్టమైన నిరోధాన్ని చవిచూడవచ్చని సాంక్ట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ విశ్లేషకుడు ఆశిష్‌ చాతుర్‌మెహతా అంచనావేస్తున్నారు. ఒక ఆంగ్లచానల్‌తో ఆయన మార్కెట్‌పై అభిప్రాయాల్ని పంచుకుంటూ స్వల్పకాలంలో లాభాలను అందించే  అవకాశం వున్న  షేర్లను సూచించారు. ఆ సిఫార్సులివే... ఐషర్‌ మోటార్స్‌ సిఫార్సు: బై, ప్రస్తుత ధర: రూ.29,664, టార్గెట్‌: రూ. 32,000–32,700, స్టాప్‌లాస్‌: రూ. 28,800 గత ఏడాదికాలంలో

Most from this category