STOCKS

News


లాంగ్‌టర్మ్‌కు స్ట్రాంగ్‌ స్టాక్స్‌

Wednesday 13th March 2019
Markets_main1552469189.png-24586

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు
దీర్ఘకాలానికి మంచి రాబడులు అందించే ఐదు స్టాకులను సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది.
1. ఏసీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1820. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. క్యాష్‌ఫ్లో ఉత్పత్తి, రిటర్న్‌ రేషియోలు పాజిటివ్‌గా ఉన్నాయి. తాజాగా ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల అంబుజాతో కుదుర్చుకున్న మెటిరియల్‌ సరఫరా ఒప్పందం కంపెనీకి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. డీజిల్‌, పెట్‌కోక్‌ ధరల తరుగుదల కూడా కలిసివచ్చే అంశమే. రాబోయే రోజుల్లో కంపెనీ ఎబిటాలో 11.5 శాతం, లాభంలో 15.8 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు కావచ్చని, ఆర్‌ఓఈ 12 శాతానికి చేరవచ్చని అంచనా.
2. డీసీబీ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 230. కొనొచ్చు. ఇప్పటివరకు బ్యాంకులు పూర్తిగా చొచ్చుకుపోని రిటైల్‌(స్వయం ఉపాధి), ఎస్‌ఎంఈ విభాగాల్లోకి బ్యాంకు వేగంగా చొచ్చుకుపోతోంది. కంపెనీ వద్ద దండిగా మూలధనం ఉండడం, వైవిధ్యభరిత పోర్టుఫోలియోతో రాబోయే రోజుల్లో రుణాల జారీలో 24 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండగలదు. కొత్తగా ఏర్పరిచిన బ్రాంచ్‌లు బ్రేక్‌ఈవెన్‌ సాధించే క్రమంగలో ఉన్నాయి. వాల్యూషన్లు ప్రీమియంగా ఉన్నా కొనుగోలు చేయవచ్చు. 
3. ఫెడరల్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 135. కొనొచ్చు. బాలెన్స్‌ షీట్‌ సైజు, నాణ్యతలో వృద్ధి క్రమం, దేశవ్యాప్తంగా విస్తరించే వ్యూహాలను పరిశీలిస్తే ఫెడరల్‌ బ్యాంకును అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్‌ బ్యాంకుగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బ్యాంకు పలువురు సీనియర్లను నియమించుకొని అట్రిషన్‌ సమస్యలు లేకుండా జాగ్రత్తలు పడుతోంది. బ్యాంకు క్యాపిటల్‌ అడిక్వసీ నిష్పత్తి చాలా పాజిటివ్‌గా ఉంది. వాల్యూషన్లు బాగున్నాయి.
4. మైండ్‌ట్రీ: టార్గెట్‌ రూ. 1030. కొనొచ్చు. వైవిధ్యభరితమైన రంగాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రెవెన్యూ దాదాపు వందకోట్ల డాలర్లకు చేరువలో ఉంది. త్వరలో కంపెనీ దిగ్గజ ఐటీ కంపెనీల సరసకు చేరే ఛాన్సులున్నాయి. కంపెనీ డాలర్‌ రెవెన్యూ వచ్చే రెండళ్ల పాటు వరుసగా సుమారు 14 శాతం చొప్పున వృద్ధి సాధించగలదని అంచనా.
5. టాటా మెటాలిక్స్‌: టార్గెట్‌ రూ. 865. కొనొచ్చు. కంపెనీ డీఐ పైప్స్‌ వ్యాపారం చాలా బాగుంది. కొత్తగా పీసీఐ ప్రాజెక్ట్‌ను ఆరంభించడంతో ఇకపై ఎర్నింగ్స్‌లో 12 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందని అంచనా. ప్రస్తుతం వాల్యూషన్లు 2020-2021 పీఈ అంచనాలకు 9రెట్ల వద్ద ఉండి ఆకర్షణీయంగా ఉన్నాయి. త్వరలో రీరేటింగ్‌ ఉంటుందని అంచనా. 



You may be interested

మార్కెట్‌కు అండగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం

Wednesday 13th March 2019

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం అండతో సూచీలు భారీ ర్యాలీని చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం, హెచ్‌డీఎఫ్‌ 2శాతం ర్యాలీ చేశాయి. కొత్త గరిష్టానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సేవలు అందిస్తున్న హెచ్‌డీఎసీ బ్యాంకు నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.2,175.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీలో భాగంగా షేరు 3శాతం రూ.2,233.35ల గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ

వచ్చే ఐదేళ్ల పాటు ఎర్నింగ్స్‌ వృద్దిలో జోరు

Wednesday 13th March 2019

దేశీయ ఎకానమీ సరికొత్త ఫండమెంటల్‌ సైకిల్‌ ఆరంభంలో ఉందని మోర్గాన్‌స్టాన్లీ వ్యూహకర్త రిధమ్‌ దేశాయ్‌ చెప్పారు. ఈ సైకిల్స్‌ కాలపరిమితి దీర్ఘకాలం ఉంటుందని, తాజా సైకిల్‌ కనీసం 5- 7 సంవత్సరాలు కొనసాగవచ్చని తెలిపారు. ఇలాంటి చక్రీయ వలయాల కాలంలో ఎర్నింగ్స్‌ వృద్ధి బలంగా నమోదవుతుందన్నారు. ఇందుకు తగిన రంగం సిద్ధం చేసే క్రమంలో రెండేళ్లుగా రెవెన్యూ వృద్ధి ఊపందుకుంటోందని వివరించారు. ఇంకా లాభాల్లో జోరు పెరగాల్సిఉందన్నారు. ఇవన్నీ గమనిస్తే

Most from this category