News


షాపింగ్‌కు ఫండ్‌ మేనేజర్లు రెడీ!

Monday 8th October 2018
Markets_main1539023167.png-20936

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే 12 శాతం వరకు పతనమయ్యాయి. స్టాక్‌ ధరలు తక్కువకు పడిపోతే కొనేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు నగదు నిల్వలతో సిద్ధంగా ఉన్నారు. మార్కెట్‌ మరింత దిద్దుబాటుకు గురైతే, బాగా ఆకర్షణీయ విలువలకు చేరిన స్టాక్స్‌ను వారు బుట్టలో వేసుకోవడం ఖాయం. ఇప్పటికే చాలా స్టాక్స్‌ ఆకర్షణీయ ధరలకు చేరాయి. స్థూల ఆర్థిక అంశాలు, రూపాయి, చమురు ధరల కదలికల ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్‌ను వారు గమనిస్తూ మంచి అవకాశాల కోసం కాచుకుని కూర్చున్నారు. 

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ప్రస్తుతం తమ నిర్వహణలోని ఆస్తుల్లో సుమారు 8-10 శాతం మేర నగదు నిల్వలతో ఉన్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్‌, మీడియా విభాగాల్లో షేర్లను కొనుగోలు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. తమకు వచ్చే ఉపసంహరణలకు నగదు చెల్లింపుల కోసమని 4-5 శాతం మేర లిక్విడిటీ ఉంచుకోవడం సాధారణం. ‘‘మార్కెట్‌ పతనంలో కచ్చితంగా కొనుగోళ్లు చేస్తాం. వాటి వ్యాల్యూషన్లు ఇంతకుముందు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడవి మార్కెట్‌ కరెక్షన్‌తో చౌకగా మారాయి’’ అని బీఎన్‌పీ పారిబాస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ ఆనంద్‌షా తెలిపారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో చక్కని ఫ్రాంచైజీ, డిస్ట్రిబ్యూషన్‌, నెట్‌వర్క్‌, ట్రెజరీ మేనేజ్‌మెంట్‌, అస్సెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ కలిగిన స్టాక్స్‌ను కొనుగోలు చేయనున్నట్టు సంకేతం ఇచ్చారు. 

 

‘‘ప్రస్తుత పతనంలో అదనపు కొనుగోళ్లు చేస్తాం. చమురు, రూపాయి ప్రభావాలను తట్టుకునే మీడియా, ఎగుమతి ఆధారిత స్టాక్స్‌ను కొనుగోలు చేస్తాం’’అని ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధికారి విరాళ్‌ బెరవాలా తెలిపారు. రూపాయి డాలర్‌తో 75 స్థాయికి వెళుతుందని ఫండ్‌ మేనేజర్లు అంచనా వేస్తున్నారు. బలహీన రూపాయి ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మాలకు మేలు చేస్తుందని, ఇందులో ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ఫండ్‌ మేనేజర్లు పేర్కొంటున్నారు. 2016-2017లో ఐటీ, ఫార్మా కంపెనీలు ఎదుర్కొన్న వ్యాపారపరమైన సమస్యలు ఇప్పుడు బలహీనపడ్డాయని, ఈ రెండు రంగాల వ్యాపారం రికవరీ అవుతోందన్నది వారి అభిప్రాయం. దీనికితోడు రూపాయి బలహీనత వీటికి లాభించే అదనపు అంశంగా పేర్కొంటున్నారు. అయితే, ఆటోమొబైల్‌ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీల కంపెనీలపై స్వల్ప కాలంలో ప్రభావం ఉంటుందని చెబతున్నారు.You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.2.3 లక్షల కోట్లు అవుట్‌

Tuesday 9th October 2018

సెప్టెంబర్‌ నెలలో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌కు పెద్ద ఎత్తున ఉపసంహరణలు ఎదురయ్యాయి. సుమారు రూ.2.3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, ఇందులో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచే రూ.2.11 లక్షల కోట్లు ఉండడం గమనార్హం. ఇన్‌కమ్‌ స్కీమ్స్‌ నుంచి రూ.32,504 కోట్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.33 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో 41 మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ సెప్టెంబర్‌ చివరి నాటికి

మధ్య కాలానికి మూడు స్టాక్స్‌

Monday 8th October 2018

మార్కెట్లలో భారీ కరెక్షన్‌ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాల కోసం ఇన్వెస్టర్లు పరిశీలన చేయడం సర్వసాధారణం. సెన్సెక్స్‌ ఇప్పటికే రూ.4,600 పాయింట్లను నష్టపోయింది. రూ.22.74 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. జనవరి గరిష్టాల నుంచి చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 23.56 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 31.42 శాతం పడిపోయాయి. స్టాక్స్‌ విలువలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ మార్కెట్‌ సెంటిమెంట్‌ ఇంకా ప్రతికూలంగానే ఉంది. ఇందుకు చమురు ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌

Most from this category