STOCKS

News


ఫండ్‌ మేనేజర్స్‌ మెచ్చిన షేర్లు ఇవే..

Thursday 15th November 2018
Markets_main1542258007.png-22020

అక్టోబరులో సెన్సెక్స్‌ 5 శాతం నష్టపోయినప్పటికీ.. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల జోరు మాత్రం ఈ సమయంలో నిలకడగా కొనసాగింది. మార్కెట్‌ పతనాన్ని ఒక అవకాశంగా చూసిన ఫండ్‌ మేనేజర్లు, నాణ్యమైన పలు షేర్లను కొనుగోలుచేశారు. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఆస్తులు 22.2 లక్షల కోట్లకు చేరుకోగా.. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు 45 శాతం, డెట్‌ ఫండ్స్‌ అసెట్స్‌ 31 శాతం, లిక్విడ్‌ ఫండ్స్‌ ఆస్తులు 20 శాతం పెరిగినట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ వెల్లడించింది. అక్టోబరులో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఫండ్‌ మేనేజర్లు మెచ్చిన షేర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. 

టాప్‌ 10 లార్జ్‌క్యాప్‌ షేర్లు
కోల్ ఇండియా, న్యూ ఇండియా అస్యూరెన్స్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఏషియన్‌ పెయింట్స్.

మిడ్‌క్యాప్‌ టాప్‌ 10 షేర్లు
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవంతి ఫీడ్స్, ఏసీసీ, హెచ్‌ఈజీ, ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌, రిలయన్స్ క్యాపిటల్, ఎస్‌జేవీఎన్‌, కేఆర్‌బీఎల్, ఫ్యూచర్ రిటైల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.

స్మాల్‌క్యాప్‌ టాప్‌ 10 షేర్లు
టెక్నో ఎలెక్ట్రిక్, గుజరాత్ ఫ్లూరో, స్పైస్ జెట్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, టెక్నో ఎలెక్ట్రిక్ (మెర్జిడ్‌), నవకర్ కార్పొరేషన్, వి-మార్ట్, మాస్టక్‌, లక్స్ ఇండస్ట్రీస్.



You may be interested

బెర్జర్‌ పెయింట్స్‌ లాభం రూ.117 కోట్లు  

Thursday 15th November 2018

హైదరాబాద్‌: బెర్జర్‌ పెయింట్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం సెప్టెంబర్‌ క్వార్టర్లో 5.35 శాతం వృద్ధితో రూ.117.29 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.1,502 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.111.34 కోట్లు, ఆదాయం రూ.1,292 కోట్లుగా ఉంది. ఇవి జీఎస్టీతో కూడిన గణాంకాలు అని, క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు ఎక్సైజ్‌ డ్యూటీతో ఉన్నందున పోల్చి చూడకూడదని కంపెనీ పేర్కొంది. జీఎస్టీని మినహాయించి చూస్తే

ఆన్‌లైన్లో ఆక్స్‌ఫర్డ్‌ తెలుగు డిక్షనరీ

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌ ప్రపంచ భాషల కార్యక్రమంలోకి తెలుగు కూడా చేరింది. తెలుగు ఆన్‌లైన్‌ డిక్షనరీ https://te.oxforddictionaries.com అందుబాటులోకి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌ సంస్థ 2015 సెప్టెంబర్‌లో  ‘ఆక్స్‌ఫర్డ్‌ గ్లోబల్‌ లాంగ్వేజెస్‌’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలకు సంబంధించి లెక్సికో గ్రాఫికల్‌, ఇతర భాషా వనరులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవటమే ఈ ప్రాజెక్టు ధ్యేయం. ‘‘ఆక్స్‌ఫర్డ్‌ ప్రపంచ భాషల్లోకి తాజాగా తెలుగు చేరడం పట్ల సంతోషంగా

Most from this category