STOCKS

News


డీమ్యాట్‌ రూపంలోనే కొత్త షేర్ల జారీ

Wednesday 12th September 2018
Markets_main1536729172.png-20180

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కె‍ట్లో లిస్ట్‌ కాని కంపెనీలు కొత్త షేర్లను వచ్చే నెల 2 నుంచి డీమ్యాట్‌ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ కంపెనీలు డీ మ్యాట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే షేర్లను బదిలీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమ నిధుల వరదను నిరోధించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. పారదర్శకతను మరింతగా పెంచడానికి, ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం, కార్పొరేట్‌ రంగంలో మంచి వాతావరణం సృష్టించడం లక్ష్యాలుగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
డీమ్యాట్‌ రూపంలో షేర్లను జారీ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగితం రూపంలోని షేర్ల వల్ల అవి చోరీకి గురికావడం, చినిగిపోవడం, మోసాలకు గురికావడం వంటి సమస్యలు ఉంటాయని వివరించింది. డీమ్యాట్‌ రూపంలో షేర్ల జారీ వల్ల ఈ సమస్యలుండవని పేర్కొంది. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చే నెలలో 4జీ స్పెక్ట్రమ్‌

Wednesday 12th September 2018

ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చే నెలలో ‘4జీ స్పెక్ట్రమ్‌’ అనుమతులు లభించనున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. అనుమతుల అనంతరం ప్రైవేట్‌ రంగ టెలికం ఆపరేట్లరకు పోటీగా సర్వీసులను అందించడానికి వీలుకలుగుతుందని వివరించారు. 2100 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో సేవలను అందించనుండగా, త్వరలోనే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు అందుబాటులోనికి రానున్నాయి.

జియోఫోన్లలో వాట్స్‌యాప్‌

Wednesday 12th September 2018

హైదరాబాద్‌: ఇక నుంచి రిలయన్స్‌ జియో విక్రయిస్తున్న అన్ని ఫోన్లలో వాట్స్‌యాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని మంగళవారం రిలయన్స్‌ రిటైల్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో అమ్ముడవుతున్న రూ.1,500 లోపు మొబైల్స్‌లో తమ మార్కెట్‌ వాటా 80 శాతానికి చేరుకుందని రిలయన్స్‌ ప్రకటించింది. ఈ విభాగానికి చెందిన ప్రతి 10 ఫోన్ల అమ్మకాలలో 8 జియో ఫోన్లు ఉంటున్నాయని, జియోఫోన్‌ ద్వారా ట్రాన్స్‌మిట్‌ అవుతున్న వాయిస్ సందేశాలు

Most from this category