News


కాంట్రాబెట్స్‌పై ఎఫ్‌పీఐల కన్ను!

Thursday 22nd August 2019
Markets_main1566453966.png-27943

తొలి త్రైమాసికంలో ఎఫ్‌పీఐల కొనుగోళ్ల ధోరణి పరిశీలిస్తే ఎక్కువగా కాంట్రాబెట్స్‌పై(బాగా క్షీణించిన స్టాకులు) నమ్మకం ఉంచినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్యు1లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా టెలికం, ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో రంగాల షేర్లను ఎక్కువగా కొన్నాయి. ఈ రంగాల్లో కాంట్రా బెట్స్‌ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. 
అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే క్యు1లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల వివరాలు ఇలా ఉన్నాయి...
- ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాల్లో ఎఫ్‌ఐఐలు వరుసగా 4.4, 2.5 శాతం మేర వాటా పెంచుకున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు దాదాపు రూ. 19వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐలు పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో ఈ రెండిటిలో పెట్టిన మొత్తం వాటా దాదాపు మూడింట రెండొంతులకు సమానం. 
- ఎన్‌బీఎఫ్‌సీల్లో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, గృహ్‌ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ల్లో ఎఫ్‌పీఐలు తమ వాటాను దాదాపు 1.5 నుంచి 8 శాతం వరకు పెంచుకున్నాయి. 
- ఆటో రంగంలో మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎంలు ఎఫ్‌పీఐల టాప్‌బెట్స్‌గా ఉన్నాయి. ఈ రెండిటిలో విదేశీ మదుపరులు తమ వాటాను వరుసగా 0.9, 3 శాతం మేర పెంచుకున్నాయని ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాలు చెబుతున్నాయి. 


FPI

You may be interested

2వారాల కనిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Thursday 22nd August 2019

ప్రైవేట్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2వారాల కనిష్టానికి పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో కీలమైన ఈ ఇండెక్స్‌ నేడు 27,690.05 వద్ద ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌ 7.50శాతం నష్టపోవడంతో పాటు, అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ, కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1.5శాతం నుంచి 1శాతం క్షీణించడంతో నేటి ఉదయం ట్రేడింగ్‌లో 27385.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ నెల

ఈ స్టాకులపై ఫారిన్‌ బ్రోకరేజ్‌లేమంటున్నాయి!

Thursday 22nd August 2019

వివిధ స్టాకులు, కొన్ని రంగాలపై అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల ధృక్పథాలు ఇలా ఉన్నాయి... = మారుతీ సుజుకీపై క్రెడిట్‌ సూసీ న్యూట్రల్‌ ధృక్పథం. టార్గెట్‌ రూ. 5700. కంపెనీ పలు మోడళ్లపై డిస్కౌంట్లు పెంచింది. యెన్‌తో రూపీ క్షీణించడం మార్జిన్‌ ఒత్తిళ్లను పెంచుతుంది. పీఈ పరంగా ఇంకా అధిక వాల్యూషన్ల వద్దనే ఉంది. = ఫైనాన్షియల్స్‌పై జేపీ మోర్గాన్‌ పెద్దబ్యాంకులే మనగలుగుతాయి. రేట్ల తగ్గింపు సీడీ నిష్పత్తిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకుపై బాగా పాజిటివ్‌. రక్షణాత్మక

Most from this category