STOCKS

News


5 రోజుల్లో రూ. 400 కోట్లు

Monday 10th December 2018
Markets_main1544417536.png-22792

న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్‌వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత 5 సెషన్స్‌లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్ 3-7 మధ్య వ్యవధిలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్‌ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 6న ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయని, ఎఫ్‌పీఐలు ఒక్క రోజులోనే రూ. 361 కోట్ల విక్రయాలు జరిపారని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాంఝూ అరెస్ట్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైందన్నారు. అమెరికా - చైనా మధ్య సంబంధాలు మళ్లీ బెడిసికొట్టే ప్రమాదముందని, ఫలితంగా ఆర్థిక వృద్ధికి విఘాతం ఏర్పడవచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు ఈ ఏడాది ఇప్పటిదాకా దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 85,600 కోట్లు ఉపసంహరించారు. రూ. 35,600 కోట్లు ఈక్విటీల నుంచి, రూ. 50,000 కోట్లు డెట్ మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు. 



You may be interested

కేబినెట్‌ ముందుకు నూతన వాణిజ్య విధానం: సురేష్‌ ప్రభు

Monday 10th December 2018

పనజి: నూతన వాణిజ్య విధానాన్ని కేబినెట్‌ అనుమతి కోసం పంపినట్టు కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. నూతన పాలసీ అమలుకు సంబంధించిన కార్యాచరణకు సిద్ధమైనట్టు మంత్రి గోవాలోని పనజిలో చెప్పారు. తయారీ రంగ వృద్ధి, విదేశీ టెక్నాలజీ బదిలీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యాలతో కేంద్ర ‍ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. 

స్టార్టప్‌ లిస్టింగ్ నిబంధనలు సడలించడంపై సెబీ దృష్టి

Monday 10th December 2018

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో స్టార్టప్‌ల లిస్టింగ్‌ను ప్రోత్సహించే క్రమంలో నిబంధనలను సరళతరం చేయడంపై  మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ-కామర్స్‌, డేటా అనలిటిక్స్‌, బయోటెక్నాలజీ తదితర రంగాల స్టార్టప్‌ల నిధుల సమీకరణకు తోడ్పడే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వీటిని ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో సెబీ చర్చించనుంది. అలాగే, ఈ తరహా సంస్థల లిస్టింగ్‌ కోసం ఉద్దేశించిన 'ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం' పేరును 'ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫాం'గా మార్చే

Most from this category