STOCKS

News


రెండేళ్ల గరిష్ఠానికి ఎఫ్‌ఐఐ నెలవారీ కొనుగోళ్లు

Friday 22nd March 2019
Markets_main1553235158.png-24745

దేశీయ మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపరులకు ఒక్కమాటుగా మక్కువ పెరిగిపోయింది. దీంతో మార్చిలో సూచీలు చెలరేగిపోయాయి. సుస్థిర ప్రభుత్వంపై ఆశలు, కేంద్రబ్యాంకు సరళీకృత ధృక్పథం.. మార్కెట్‌పై ఎఫ్‌పీఐలను పాజిటివ్‌గా మార్చాయి. దీంతో అటు క్యాష్‌ ఇటు డెరివేటివ్స్‌ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. మార్చిలో ఇంతవరకు ఎఫ్‌ఐఐలు 27వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపాయి. ఒకనెల్లో ఇంతమొత్తంలో ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో కొనుగోళ్లు జరపడం రెండేళ్ల తర్వాత ఇదే ప్రథమం. 2017 మార్చిలో యూపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో సుమారు 34వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపాయి. ఎఫ్‌ఐఐల జోరుతో నిఫ్టీ మార్చినెల్లో దాదాపు 7 శాతం, బ్యాంకు నిఫ్టీ దాదాపు 11 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఎఫ్‌పీఐ పొజిషన్ల లాంగ్‌- షార్ట్‌ నిష్పత్తి 63 శాతానికి చేరింది. గత ఆరునెలల్లో ఈ నిష్పత్తి ఇంత శాతానికి చేరడం ఇదే ప్రథమం. దీన్నిబట్టి మార్కెట్లో బుల్లిష్‌ పొజిషన్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. సాధారణంగా ఈ నిష్పత్తి 50 శాతానికి పైన ఉంటే ఎఫ్‌ఐఐలు నికర లాంగ్స్‌ తీసుకున్నాయని భావిస్తారు. ఈ జోరు చూస్తుంటే ఏప్రిల్‌లో కూడా కొనసాగేట్లుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మధ్యలో కొన్ని మార్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చని కొందరి అంచనా. ప్రస్తుత ఓవర్‌బాట్‌ పరిస్థితి చూస్తే కొత్త లాంగ్స్‌కు అనుకూలంగా లేదని ఏంజల్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ రావచ్చని, అప్పుడు కొత్త పొజిషన్లు పరిశీలించవచ్చని సూచించింది. ఎక్కువమంది అనలిస్టులు ఏప్రిల్‌లో సూచీలు కొత్త గరిష్ఠాలు చూస్తాయని భావిస్తున్నారు. 



You may be interested

11500దిగువకు నిఫ్టీ

Friday 22nd March 2019

మార్కెట్లో ఒక్కసారిగా లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 11500 మార్కును కోల్పోయింది. ముఖ్యంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇంధన, అటో, బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువడగా అ‍మ్మకాలు ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నేటి మార్కెట్‌ సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 38,452 వద్ద,  నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో  11,549 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ గత

ఇండియా మార్కెట్లో మరింత సత్తా ఉంది.. వచ్చేయండి!

Friday 22nd March 2019

విదేశీ ఇన్వెస్టర్లకు క్రిస్‌ఉడ్‌ సలహా భారత ఈక్విటీ మార్కెట్లో వెయిటేజ్‌లు పెంచుకునేందుకు ఇంకా ఎంతో ఛాన్సుందని, అందువల్ల వెనకముందు ఆలోచించక భారత మార్కెట్లో పెట్టుబడులకు తరలిరావాలని విదేశీ ఇన్వెస్టర్లకు ప్రముఖ వ్యూహకర్త క్రిస్‌ఉడ్‌ సలహా ఇచ్చారు. వారం వారం ఆయన వెలువరించే గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ నివేదికలో భారత మార్కెట్‌పై పాజిటివ్‌గా స్పందించారు. ఇటీవల దేశీ మార్కెట్లో ఉన్నట్లుండి ఎఫ్‌ఐఐల ప్రవాహం పెరగడంపై స్పందిస్తూ సుస్థిర ప్రభుత్వంపై ఆశలే ఇందుకు కారణమన్నారు.

Most from this category