STOCKS

News


బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీలపై ఎఫ్‌ఐఐల మక్కువ

Thursday 18th April 2019
Markets_main1555571442.png-25203

ఎన్నికల సీజన్‌ ఆరంభమవుతున్న తరుణంలో విదేశీ మదుపరులు దేశీ సూచీల్లో ఇబ్బడిముబ్బడిగా నిధులు కుమ్మరించారు. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో ఎక్కువగా బ్యాంకింగ్‌, కన్జూమర్‌ స్టాపిల్స్‌ రంగాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా చెబుతోంది. ఎఫ్‌ఐఐల మొత్తం పెట్టుబడుల్లో 32 శాతం ఈ రెండు రంగాల్లోకి మరలినట్లు తెలిపింది. ఆర్థిక సేవల కంపెనీలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం 89 శాతానికి చేరుతుందని వివరించింది. ఇలాంటి పెట్టుబడులను మార్కెట్‌ వర్గాలు ఎలక‌్షన్‌ ట్రేడ్స్‌ అంటుంటారు. ఇలాంటి ట్రేడ్స్‌ కీలక ఉద్దేశం ఎన్నికల ఫలితాల ఆధారిత ర్యాలీని సొమ్ము చేసుకోవడమేనని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కనీస ఆదాయ పథకాలు అమలవుతాయని, దీంతో వినిమయం పెరుగుతుందని అంచనాలున్నాయి. అందుకే బ్యాంకుల తర్వాత ఎక్కువగా వినిమయ రంగ కంపెనీల్లోకి ఎఫ్‌ఐఐల నిధులు వచ్చాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న మొత్తం ఎఫ్‌ఐఐ అసెట్స్‌ విలువ 42200 కోట్ల డాలర్లు కాగా ఇందులో నాలుగోవంతు నిధులు బ్యాంకింగ్‌, వినిమయ రంగాల్లోనే ఉన్నాయి. గతాన్ని పరిశీలిస్తే ఎన్నికల సమయంలో జరిపే ఇలాంటి ట్రేడ్స్‌ మంచి లాభాలను అందిచినట్లు తెలుస్తోంది. గత ఆరు దఫాల్లో ఐదు మార్లు ఎన్నికల అనంతరం సూచీలు ర్యాలీ జరిపాయి. 2009, 2014లో విత్త సేవల రంగాల షేర్లు ప్రధాన సూచీల కన్నా ఎక్కువ లాభాలనిచ్చాయి. ఈ దఫా వినిమయ షేర్లు ఇలాంటి ఫలితాలనిస్తాయని అంచనా. బ్యాంకింగ్‌, విత్త రంగాల కంపెనీల ఎర్నింగ్స్‌లో ఈ దఫా 20 శాతం వృద్ధి ఉంటుందని అంచనాలున్నాయి. మరోపక్క డీఐఐలు ఎన్నికల సమయంలో గ్రోత్‌ స్టాక్స్‌ నుంచి వాల్యూస్టాక్స్‌ వైపు దృష్టి మరలుస్తున్నారు. You may be interested

మెటల్‌ షేర్ల పతనం

Thursday 18th April 2019

మార్కెట్‌ నష్టాల్లో భాగంగా గురువారం మెటల్‌ భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు 2శాతం నష్టపోయింది. నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ 4శాతం, సెయిల్‌ 3.50శాతం, వేదాంత, హిందాల్కో 3శాతం, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌ స్టీల్‌, నాల్కో షేర్లు 2.50శాతం నష్టపోయాయి. టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, వెల్‌స్పాన్‌ కార్ప్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మెయిల్‌ షేర్లు

ఎన్‌డీఏ మళ్లీ వస్తే.. మరింత జోరు!

Thursday 18th April 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా ఈ దఫా మరోమారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని దేశీయ మార్కెట్లు క్రమంగా ప్రైస్‌ఇన్‌ చేసుకుంటున్నాయని బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. మార్కెట్‌ అంచనాలు నిజమైతే సూచీల్లో మరింత అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా వేసింది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గోద్రేజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రామ్‌కో, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌ షేర్లను రికమండ్‌ చేసింది. ప్రస్తుతం ఎఫ్‌ఐఐ, డీఐఐల్లో మార్కెట్‌పై ఆశావహ

Most from this category