STOCKS

News


భారీ పతనాన్ని సూచిస్తున్న ఎఫ్‌పీఐ ఇండెక్స్‌ పొజిషన్లు

Tuesday 15th January 2019
Markets_main1547529730.png-23585

నిఫ్టీ కొద్ది కాలంగా స్వల్ప శ్రేణిలో ట్రేడవుతోంది. పైకి పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇస్తుందా, కిందకు నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ ఇస్తుందా? అని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐల పొజిషన్ల గణాంకాలు నిఫ్టీలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది మార్చి నుంచి బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీల ఉమ్మడి ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌(ఓఐ)ని షేర్‌ఖాన్‌ సంస్థ పరిశీలిస్తోంది. ఈ రెండు సూచీల ఉమ్మడి ఓఐ -1,00,000ను చేరితే నిఫ్టీ బాటమ్‌ అవుట్‌ అవుతోంది. ఇదే ఉమ్మడి ఓఐ 16,000- 55,000కు చేరితే నిఫ్టీ టాప్‌ అవుట్‌ అవుతోందని షేర్‌ఖాన్‌ విశ్లేషించింది. జనవరి 14న ఉమ్మడి ఐఓ - 27,979గా ఉంది. అంటే మైనస్‌ లక్షను చేరేందుకు ఇంకా చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల సూచీల్లో మరో పతనానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని షేర్‌ఖాన్‌ నిపుణుడు రోహిత్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఓఐని పరిశీలిస్తే ఎఫ్‌పీఐలు భారీగా షార్ట్స్‌ తీసుకుంటున్నారు కానీ లాంగ్స్‌ను పెద్దగా యాడ్‌ చేయడంలేదని తెలుస్తోందన్నారు.

గతేడాది మార్చి 12న ఎఫ్‌పీఐల ఉమ్మడి ఓఐ 24127కు చేరింది. దీంతో నిఫ్టీ 10421 వద్ద టాప్‌ అవుట్‌ అయి క్రమంగా మార్చి 23కు 9998 పాయింట్లకు పతనమైంది. ఏప్రిల్‌ 4న ఉమ్మడి ఓఐ మైనస్‌ 1.34 లక్షలకు చేరింది. దీంతో నిఫ్టీ 10128 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ అయి మే 15కు 10801 పాయింట్లను చేరింది. తిరిగి అక్టోబర్‌ 26న ఉమ్మడి ఓఐ మైనస్‌ 1.27 లక్షలకు చేరడంతో నిఫ్టీ 10030 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ అయింది. ప్రస్తుతం ఉమ్మడిఓఐ మైనస్‌ 30వేల వద్ద ఉంది. దీనికితోడు వాల్యూషన్లు ఎక్కువగా ఉండడం, అంతర్జాతీయ పరిస్థితులు, ఎన్నికల భయాలు కలగలిసి సూచీలను పడదోయవచ్చని రోహిత్‌ అభిప్రాయపడ్డారు. 


FPI

You may be interested

69 స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌

Tuesday 15th January 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 69 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌, పీటీసీ, నాల్కో, ఏసియన్‌ పెయింట్స్‌, సన్‌టీవీ, ఐసీఐసీఐ లుంబార్డ్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ తదితరాలున్నాయి. ఈ

10750లపైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 15th January 2019

ఆశాజనకమైన ఆర్థిక గణాంకాల విడుదలతో మంగళవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 36వేల ఎగువును, నిఫ్టీ 107500లపై ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర తిరిగి 60డాలర్లకు దిగిరావడం, ఆసియా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సైతం దేశీయ సూచీలకు సానుకూల సంకేతాలనిచ్చాయి. కేంద్ర గణాంకాలు శాఖ డిసెంబర్‌ నెలకు సంబంధించిన టోకు, రీటైల్‌ ద్రవ్యోల్బణ గణాకాంలు నిన్న విడుదల చేసింది. టోకు ధర సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత

Most from this category