STOCKS

News


అమ్మకాల మూడ్‌లో ఎఫ్‌పీఐలు!

Thursday 16th May 2019
Markets_main1557994519.png-25778

పెరుగుతున్న షార్ట్‌ పొజిషన్లు
విదేశీ సంస్థాగత మదుపరులు ఇండియా ఈక్విటీల్లో విక్రయాల మూడ్‌లోకి మారారు. యూఎస్‌, చైనా ట్రేడ్‌వార్‌, ఎన్నికల ఫలితాలపై నెగిటివ్‌ వార్తలతో విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. కేవలం ఒక్క బుధవారమే ఎఫ్‌ఐఐలు రూ. 1142 కోట్ల షేర్లను విక్రయించారు. మేసీరిస్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 3100 కోట్ల నికర విక్రయాలు జరిపారు. మేలో జరిగిన పది ట్రేడింగ్‌ సెషన్లలో ఏడు సెషన్లు ఎఫ్‌ఐఐలు నికర విక్రయాలకు మొగ్గు చూపారు. చిన్నపాటి అప్‌మూవ్‌ను కూడా పొజిషన్ల ఆఫ్‌లోడింగ్‌కు ఎఫ్‌ఐఐలు వినియోగించుకుంటున్నాయి. వాణిజ్యయుద్ధంతో పాటు ఎంఎస్‌సీఐ సూచీలో చైనా వెయిటేజ్‌ పెరగడం కూడా భారత ఈక్విటీలపై భారం పెంచిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎఫ్‌ఐఐల విక్రయాల కారణంగా వచ్చే పతనం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మార్కెట్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ ఫైనాన్షియల్‌రంగం ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వృద్ధి నమోదు చేయగలదని నిపుణుల భావన. అందువల్ల దీర్ఘకాలంలో సూచీలు అప్‌మూవ్‌నే చూపుతాయని అంచనా. కానీ ప్రస్తుతం మాత్రం డెరివేటివ్స్‌లో కూడా పతనం వైపునకే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ప్రతి ఒక్క లాంగ్‌ పొజిషన్‌కు 1.3 షార్ట్‌ పొజిషన్లున్నాయి. ఎఫ్‌పీఐల లాంగ్‌షార్ట్‌ నిష్పత్తి ఈ సీరిస్‌లో 75 శాతం నుంచి 56 శాతానికి దిగివచ్చింది. 


వర్ధమాన మార్కెట్లలో ఇండియా నెంబర్‌ 2
విదేశీ మదుపరుల అమ్మకాలతో వర్దమాన మార్కెట్ల మార్కెట్‌క్యాప్‌ ఒక్కపాటున క్షీణిస్తోంది. మేలో ప్రధాన వర్ధమాన మార్కెట్లలో మార్కెట్‌క్యాప్‌ నష్టం పరంగా ఇండియా రెండో స్థానంలో ఉంది. ఈ నెల్లో ఇండియా ఈక్విటీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 13800 కోట్ల డాలర్లమేర తరిగిపోయింది. దీంతో మార్చిలో వచ్చిన హాట్‌ మనీ క్రమంగా దేశం నుంచి బయటకుపోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఎఫ్‌ఐఐల విక్రయాల వేళ డీఐఐలు జరుపుతున్న కొనుగోళ్లు మార్కెట్‌ను మరింత పడిపోకుండా ఆపుతున్నాయి. మేలో డీఐఐలు రూ. 6100 కోట్ల కొనుగోళ్లు జరిపాయి. ఎన్నికల ఫలితాల్లో స్థిర ప్రభుత్వం వస్తే క్రమంగా ఎఫ్‌ఐఐలు వెనక్కు వస్తాయని, అస్థిర ప్రభుత్వం ఏర్పడితే డీఐఐలు సైతం అమ్మకాలకు దిగుతాయని, దీంతో సూచీల్లో భారీ పతనం తప్పదని నిపుణుల హెచ్చరిక. మే నెల్లో తైవాన్‌, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణ కొరియా, ఇండోనేసియా లాంటి వర్దమాన మార్కెట్లలో దాదాపు 100 కోట్ల డాలర్ల మేర విదేశీ నిధులు వెనక్కుమరలాయి. You may be interested

మరో రూ.50వేల కోట్లు కేటాయించండి

Thursday 16th May 2019

ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.50,000 కోట్ల మూలధనాన్ని కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ మేరకు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. అధిక రీక్యాపిటలైజేషన్‌ కేటాయింపుతో బ్యాంకుల రుణ వృద్ధిని మరింత పెంచుకోవడంతో పాటు ద్రవ్య కొరత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని పీఎస్‌యూ బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదినపై ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత లోతుగా అధ్యయనం చేస్తుందని సంబంధింత వర్గాలు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.2,477 కోట్లు

Thursday 16th May 2019

పెరిగిన ఎన్‌పీఏ కేటాయింపులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ,.2,114 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,477 కోట్లకు పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో మాత్రం ఈ బ్యాంక్‌కు రూ.718 కోట్ల నికర నష్టాలు మాత్రమే వచ్చాయి.

Most from this category