News


ఈ స్టాకులపై ఎఫ్‌పీఐల మక్కువ

Wednesday 18th July 2018
Markets_main1531893068.png-18427

జూన్‌త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న షేర్లు
దేశీయ ఈక్విటీల్లో గత త్రైమాసికం విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు((ఎఫ్‌పీఐలు) దాదాపు 20700 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులను పెంచుకోవడం గమనార్హం. ఇలా జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న షేర్లు, వాటి వివరాలు...
1. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌: జూన్‌ క్వార్టర్‌లో ఎఫ్‌పీఐలు ఈ కంపెనీలో వాటాను 6.79 శాతం మేర పెంచుకున్నాయి. యాజమాన్యం చేతులు మారుతుందని, దీంతో కంపెనీ చుట్టూ నెలకొన్న సమస్యలు సమసిపోతాయని ఎఫ్‌పీఐలు భావిస్తున్నాయి. ఫండ్స్‌ మళ్లింపునకు సంబంధించి కంపెనీపై ప్రస్తుతం నియంత్రణా సంస్థలు కన్నేసిఉంచాయి. ఈ నేపథ్యంలో ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ తాజాగా ఫోర్టిస్‌ కొనుగోలు రేసులు ముందు నిలిచింది. త్వరలో ఫోర్టిస్‌ పగ్గాలు ఐహెచ్‌హెచ్‌ చేతికి వస్తాయి. దీంతో కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని బ్రోకరేజ్‌లు సైతం అంచనాలు వేస్తున్నాయి. నోమురా ఈ షేరుకు రూ. 171 టార్గెట్‌గా ఇచ్చింది. 
2. శంకరబిల్డింగ్‌: జూన్‌ త్రైమాసికంలో కంపెనీలో ఎఫ్‌పీఐలు వాటాను 4.52 శాతం మేర పెంచుకున్నాయి. కంపెనీశక్తిని మార్కెట్లు ఇంకా సరిగా పసిగట్టలేదని యూబీఎస్‌ వ్యాఖ్యానించింది. మార్కెట్లో కంపెనీ చొచ్చుకుపోతున్న తీరు చూస్తే త్వరలో అత్యంత మేలైన వృద్ధి సాధిస్తుందని భావించవచ్చని తెలిపింది. కంపెనీకి పోటీ తక్కువగా ఉండడం, కంపెనీ కార్యక్షేత్రంలో అసంఘటిత రంగానికి ప్రధాన వాటాఉండడంతో కంపెనీ విస్తరణకు ఎన్నో అవకాశాలున్నాయని తెలిపింది. టార్గెట్‌ ధరను రూ.2150గా నిర్ణయించింది. 
3. రెప్కో హోమ్‌ఫైనాన్స్‌: కంపెనీలో ఎఫ్‌పీఐలు జూన్‌ త్రైమాసికంలో వాటాను 4.4 శాతం పెంచుకున్నాయి. కంపెనీ వాల్యూషన్లపరంగా బాగానే ఉందని, అయితే వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగుపడాల్సిఉందని ఎలెరా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. జూన్‌లో యూఎస్‌ఏకు చెందిన మొహినిష్‌ పబ్రాయ్‌ ఫండ్‌ ఎక్కువగా వాటా పెంచుకుంది.
4. డిష్‌టీవీ: జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు ఈ కంపెనీలో వాటాను 2.67 శాతం మేర పెంచుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని ఐసీఐసీఐడైరెక్ట్‌ పేర్కొంది. అయితే కేబుల్‌, డీటీహెచ్‌ రంగాల్లోకి జియో కాలుమోపితే కంపెనీపై ప్రభావం పడుతుందని, అప్పుడు రీరేటింగ్‌కు అవకాశముందని అంచనా వేసింది. 
5. హెచ్‌ఈజీ: జూన్‌ క్వార్టర్‌లో విదేశీ మదుపరులు కంపెనీలో వాటాను 2.24 శాతం పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఈ షేరు దాదాపు ఎనిమిది రెట్లు దూసుకుపోయింది. అయినా ఈ షేరుపై మదుపరులకు మోజు తగ్గడం లేదు. త్వరలో మరిన్ని రీరేటింగ్‌లు ఉంటాయని, స్థిరమైన వృద్ధి నమోదు చేస్తుందని మాక్కై‍్వరీ అభిప్రాయపడింది. 

 You may be interested

వర్ధమాన మార్కెట్లపై టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ కన్ను...

Wednesday 18th July 2018

వర్ధమాన మార్కెట్లపై టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ కన్ను... ప్రపంచపు అతిపెద్ద మనీ మేనేజర్లు ప్రస్తుతం వర్ధమాన మార్కెట్లపై ప్రధానం దృష్టి కేంద్రీకరించారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎమర్జింగ్‌ మార్కెట్లు స్టాక్స్‌లో 7 ట్రిలియన్‌ డాలర్లమైన నష్టపోయాయని, ఇప్పుడు ర్యాలీ చేస్తాయని విశ్వాసంతో ఉన్నారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ వంటి సంస్థలకు చెందిన ఇన్వెస్టర్లు, వ్యూహాకర్తలు.. చౌక ధరలు, కార్పొరేట్‌ లాభాలు పెరుగుతుండటం, బలమైన ఫండమెంటల్స్‌ వంటి

4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియో టాప్‌

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: డౌన్‌లోడ్‌ స్పీడ్‌కు 4జీ టెలికం ఆపరేటర్లలో 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌కి సంబంధించి రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిల్చింది. మరోవైపు అప్‌లోడ్‌కి సంబంధించి అత్యధిక స్పీడ్‌తో ఐడియా సెల్యులార్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. మే నెలకు సంబంధించిన ఈ గణాంకాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం వెల్లడించింది. దీని ప్రకారం జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 22.3 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇది సమీప ప్రత్యర్ధి సంస్థ

Most from this category