STOCKS

News


ఎఫ్‌పీఐలు ఏం కొంటున్నారు!

Monday 10th June 2019
Markets_main1560148081.png-26190

విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ మార్కెట్లో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎఫ్‌ఐఐలు తాము పెట్టుబడులు పెట్టదలిచిన కౌంటర్లలో ఇతర ఇన్వెస్టర్లు మేల్కొనే ముందే పెట్టుబడులు పెడతారు. వివిధ రంగాలు, ప్రాంతాల్లో ట్రెండ్స్‌ను ముందే పసిగడతారు. దీర్ఘకాలిక సంపద సృష్టికి వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అందువల్ల వీరు ఎందులో పెట్టుబడులు పెట్టాయో పరిశీలించి మదుపరులు తమ పోర్టుఫోలియోలో సదరు స్టాకులను చేర్చుకుంటుంటారు. గత ఏడాది కాలంలో భారీగా పతనమైన నాణ్యమైన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలు అధికంగా పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ఐషర్‌ మోటర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కాస్ట్రాల్‌, కాల్‌గేట్‌ పామోలివ్‌ షేర్లలో ఎఫ్‌ఐఐలు తమ వాటాలను 1.2- 5 శాతం వరకు పెంచుకున్నారు. ఈ కంపెనీలు అధిక రాబడులు ఇచ్చే సత్తా ఉన్నవే కాకుండా ఇటీవల కాలంలో భారీగా పతనమై వాల్యూషన్ల పరంగా ఆకర్షణీయంగా మారాయి. 


మరోవైపు ఇదే సమయంలో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌లు) లార్జ్‌క్యాప్స్‌పై ముఖ్యంగా క్యాపిటల్‌గూడ్స్‌, యుటిలిటీ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టాయని తేలింది. ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, కమ్మిన్స్‌ ఇండియాల్లో స్థానిక ఎంఎఫ్‌లు 1.5- 7 శాతం మేర వాటాలు పెంచుకున్నాయి. ఈ కంపెనీల ఆర్డర్‌ బుక్స్‌ బలంగా ఉండడం, గతేడాది ఇవన్నీ కరెక‌్షన్‌కు గురై వాల్యూషన్ల పరంగా దిగిరావడంతో వీటిపై స్థానిక ఎంఎఫ్‌లకు మక్కువ పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


FPI

You may be interested

11750 కోల్పోతే భారీ పతనం?!

Monday 10th June 2019

బొనాంజ పోర్టుఫోలియో అంచనా దేశీయ మార్కెట్లు వారాన్ని లాభాలతో ఆరంభించాయి. నిఫ్టీ 11975 పాయింట్ల వరకు ఎగిసినా ఆ లాభాలని నిలబెట్టుకోలేక మధ్యాహ్నానికి 11900 పాయింట్ల వద్ద స్వల్పలాభంతో ట్రేడవుతోంది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ రైజింగ్‌ చానెల్‌ మధ్యలో కదలాడుతోందని, ఈ చానెల్‌లో ఉన్నంత వరకు దిగవకు వచ్చినప్పుడల్లా కొనుగోలు చేయడం, పై అవధి వద్ద అమ్మడం చేయవచ్చని బొనాంజా పోర్టుఫోలియో అనలిస్టు రూపక్‌డే సూచించారు. దీంతో పాటు చార్టుల్లో హైపీక్‌

పసిడిలో లాభాల స్వీకరణ

Monday 10th June 2019

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నేడు ఆసియాలో 15డాలర్లు నష్టపోయి 1331 డాలర్ల కనిష్టస్థాయికి పతనమైంది. నేడు చైనా విడుదల చేసిన బలమైన వాణిజ్య మిగులు గణాంకాలు, అమెరికా - మెక్సికోల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతుండటంతో ఇన్వెస్టర్లు  నేడు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. క్రితం వారం ట్రేడింగ్‌లో పసిడి ధర 14నెలల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు

Most from this category