STOCKS

News


గోల్డ్‌ ఈటీఎఫ్‌ల జోలికొద్దు..

Tuesday 6th November 2018
Markets_main1541491203.png-21755

  • టైటాన్‌ ఇండస్ట్రీస్‌ బెస్ట్‌..
  • వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌ వ్యాఖ్య

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. బంగారంపై ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారు టైటాన్‌ ఇండస్ట్రీస్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. పసిడిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆనందం పొందలేమన్నారు. గోల్డ్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా చూడకూడదని అభిప్రాయపడ్డారు. బంగారంలో వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపారు. అయితే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడానికి మంచి మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. అయినా కూడా బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడం తెలివైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. 
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉంటుందని ధీరేంద్ర కుమార్‌ గుర్తుచేశారు. దీర్ఘకాలంలో చూస్తే.. ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలతో పోలిస్తే బంగారానికి తక్కువ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అయినా కూడా బంగారంలో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎంచుకోవడం ఉత్తమమని సూచించారు. బంగారం ధరలు పెరిగినప్పుడు వచ్చే లాభం కన్నా గోల్డ్‌ బాండ్లు ఇంకొంచెం ఎక్కువ ప్రతిఫలాన్నే అందిస్తాయని పేర్కొన్నారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్స్‌లలో ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉంటుందని తెలిపారు. 
తొలిగా వాచ్‌ తయారీ కంపెనీగా ప్రారంభమైన టైటాన్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పుడు అది పెద్ద జువెలరీ సంస్థగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. సామర్థవంతమైన మేనేజ్‌మెంట్‌, విశ్వసనీయత, ప్రజలకు జువెలరీపై ఉన్న మక్కువ వంటివి సానుకూల అంశాలని తెలిపారు. భారత్‌లో బంగారం వినియోగమౌతూనే ఉంటుందని, ప్రజలు జువెలరీని కొనుగోలు చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. అందువల్ల టైటాన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు ఈ దీపావళి సరైన సమయని తెలిపారు. 

ఇన్వెస్టర్లకు ధీరేంద్ర కుమార్‌ సలహాలు..
► రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేయాలి.
► ఆదాయంలో కొంత భాగాన్ని ఈక్విటీ ఫండ్‌కు కేటాయించాలి. 
► ప్రతి రోజూ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యాల్యు ఎలా ఉందో చూడకూడదు. 
► ఏక మొత్తంగా ఎప్పటికీ ఇన్వెస్ట్‌ చేయకూడదు.
► సిప్‌ మార్గంలో పెట్టుబడి కొనసాగించాలి.
► స్వల్పకాలిక డబ్బును ఈక్విటీలో పెట్టొద్దు.
► దీర్ఘకాలిక లక్ష్యాలను కలిగి ఉండాలి.  



You may be interested

టాటా మోటర్స్‌ ర్యాలీ

Tuesday 6th November 2018

అక్టోబర్‌ నెలలో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలు దాని మాతృ సంస్థ టాటామోటర్స్‌ షేరుకు జోష్‌నిచ్చాయి. ఫలితంగా టాటామోటర్స్‌ షేరు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5శాతం లాభపడింది. నేడు టటా మోటర్స్‌ షేరు రూ.192ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అక్టోబర్‌లో జాగ్వార్‌ లేండ్‌రోవర్‌ అమ్మకాలు ఇది 32శాతం వృద్ధి చెంది 6942 యూనిట్లకు పెరిగినట్లు టాటామోటర్స్‌ ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో అమ్మకాలు 5270 యూనిట్ల మాత్రమే నమోదయ్యాయి. జాగ్వార్‌ వాహన అమ్మకాలు

వ్యాల్యుయేషన్స్‌ మించితే వైదొలగండి

Tuesday 6th November 2018

మార్కెట్‌లో ఇంకా 3-4 శాతం కరెక‌్షన్‌ మిగిలే ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌డియో అగర్వాల్‌ తెలిపారు. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌లో పతనం కొనసాగుతుందని, మార్కెట్‌ మొత్తంగా చూస్తే దిద్దుబాటుకు గురయ్యిందని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉంటే తప్ప ఎఫ్‌ఐఐలు మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించరని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ద్రవ్యోల్బణానికి సమంగా కార్పొరేట్‌

Most from this category